ఆస్క్ కేటీఆర్ ట్విట్టర్ లైవ్ ప్రోగ్రామ్ కి ఫుల్ రెస్ఫాన్స్

ట్విట్టర్ లో ఆస్క్‌ కేటీఆర్ హాష్‌టాగ్‌ తో రాష్ట్రానికి సంబంధించిన సందేహాలు, ప్రశ్నలకు అవకాశం కల్పించారు మంత్రి కేటీఆర్. గురువారం(అక్టోబర్-4) సాయంత్రం కేటీఆర్ ఈ లైవ్‌ ప్రోగ్రామ్ ను ట్విట్టర్‌ లో ప్రారంభించారు. ఈ లైవ్ షోకు మంచి రెస్పాన్స్ వచ్చింది.  ట్విట్ట‌ర్ ఇండియా ఈ లైవ్ షోను ఏర్పాటు చేసింది. కేటీఆర్‌ను ప్రశ్నించాలనుకున్నవాళ్లు ఆస్క్‌ కేటీఆర్ హాష్‌టాగ్‌ తో ట్వీట్ చేశారు. యూజర్లు అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ లైవ్‌ లో సమాధానాలు చాలామంది యువత సెల్ఫ్ ఎంప్లాయిమెంట్, తెలంగాణ డెవలప్‌మెంట్, ఐటీ రంగం అభివృద్ధి లాంటి వాటి మీద ప్రశ్నించారు. వాటన్నింటికీ కేటీఆర్ జవాబు చెప్పారు. రాబోయో ఎన్నికల మేనిఫెస్టో ఎలా ఉంటొందని ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు…నాలుగేళ్లుగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్ర అభివృద్ధి కోసం ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలతో కూడిన మేనిఫెస్టో సిద్ధమవుతోందని…తెలంగాణ అభివృద్ధికి తగ్గట్టుగా మేనిఫెస్టో ఉంటుందని కేటీఆర్ తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates