ఆస్ట్రేలియాలో రంగు చూసి అవమానించారు.. శిల్పాశెట్టి ఆరోపణ

సిడ్నీ:  ఎదుటివారి ప్రవర్తన రంగును బట్టి మారుతుందా అని ఇన్ స్టాగ్రామ్ లో ప్రశ్నించింది బాలీవుడ్ నటి శిల్పాశెట్టి. ఆస్ట్రేలియాలోని సిడ్నీ ఎయిర్ పోర్టులో.. క్వాంటాస్ ఎయిర్ వేస్ సిబ్బంది తనను అవమానించారని  పోస్ట్ చేసింది. క్వాంటాస్ ఎయిర్ లైన్స్ సిబ్బంది దీనిని కాగ్నిజెన్స్ గా తీసుకోవాలని కోరింది. తమ సిబ్బందికి ప్రవర్తన నేర్పాలంది. రంగు ఆధారంగా  మనుషులతో ప్రవర్తించడం దారుణం అని వివరించి చెప్పింది శిల్పాశెట్టి.

తన బిజినెస్ పనిమీద రెండు బ్యాగులతో  మెల్‌బోర్న్‌ కు వెళ్లేందుకు.. సిడ్నీ ఎయిర్ పోర్టుకు వెళ్లింది శిల్పాశెట్టి. చెక్ ఇన్ లో మెల్ అనే ఎంప్లాయ్.. ఓ బ్యాంగ్ ను చూసి .. అది రెగ్యులర్ కంటే హెవీగా ఉందని.. హెవీ లగేజ్ తనిఖీ చేసే కౌంటర్ కు వెళ్లాలని సూచించింది. హెవీ లగేజ్ చెక్ చేసే కౌంటర్ కు వెళ్తే… ఇది రెగ్యులర్ వెయిట్ తోనే ఉందని.. మ్యాన్యువల్ గా చెక్ చేసే పాయింట్ కు వెళ్లండని సూచించారు. మళ్లీ మొదటి కౌంటర్ కు వస్తే.. వాళ్లు హెవీ లగేజ్ కు తిప్పి పంపారని శిల్పాశెట్టి చెప్పింది. తనకు సమయంలేదని చెప్పినా… మ్యాన్యువల్ గా చెక్ చేసే కౌంటర్ దగ్గరున్న సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని శిల్పా శెట్టి అన్నారు.

క్వాంటాస్ ఎయిర్ లైన్స్ సిబ్బందికి సంస్కారం, మర్యాద నేర్పాలని.. రంగును చూసి ఇలా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని శిల్పా శెట్టి కోరింది. ప్రయాణికులతో మాట్లాడే పద్ధతి ఇది కాదని.. సభ్యత నేర్చుకోవాలని ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది శిల్పా.

Posted in Uncategorized

Latest Updates