మెల్ బోర్న్ టెస్ట్ : ఆస్ట్రేలియా టార్గెట్ -399

 మెల్ బోర్న్ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్,  నాలుగవ రోజు రెండో ఇన్నింగ్స్ ను కొనసాగించిన భారత్ కొద్దిసేపటికే.. డిక్లేర్ చేసింది. ఆస్ట్రేలియా ముందు భారత్ 399 పరుగుల భారీ లక్షాన్ని ఉంచింది.  మయాంక్ అగర్వాల్ (42), రిషబ్ పంత్ (32) రన్స్ చేశారు. 33 ఓవర్లో పాట్ కమిన్స్ వేసిన బాల్ కు రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యారు. హాజెల్ వుడ్ బౌలింగ్ లో పంత్ (33) పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఆ తరువాత క్రీజు లోకి వచ్చిన జడేజా 5 రన్స్ మాత్రమే చేశాడు. దీంతో భారత్ 106/8 వద్ద ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది.

399 పరుగుల టార్టెట్ తో బరిలో దిగిన ఆసిస్ కు మొదట్లోనే ఎదురుదెబ్బ తగిలింది. బుమ్రా వేసిన మొదటి ఓవర్ లో ఫించ్(3), కోహ్లీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 13 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హారిస్ ను జడేజా అవుట్ చేశాడు.

Posted in Uncategorized

Latest Updates