ఆస్ట్రేలియా-భారత్ మూడో టెస్ట్ : టీమ్ ఇదే

మెల్‌ బోర్న్: ఆస్ట్రేలియాతో నాలుగు టెస్ట్ ల సిరీస్ లో భాగంగా డిసెంబర్-26 నుంచి ప్రారంభమయ్యే మూడో టెస్ట్ మ్యాచ్ టీమ్ ను అనౌన్స్ చేసింది BCCI. టీమ్ లో మూడు మార్పులు చేశారు. ఫస్ట్ రెండు టెస్టుల్లో విఫలమైన ఓపెనర్లు మురళీ విజయ్, KL రాహుల్‌లను టీమ్‌లో నుంచి తొలగించారు.

స్పిన్నర్ అశ్విన్ గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో.. మూడో టెస్టుకూ దూరం అయ్యాడు. పేస్‌ బౌలర్ ఉమేష్ యాదవ్‌ ను కూడా లేడు. ఆల్‌ రౌండర్ రవీంద్ర జడేజాను టీమ్ లోకి తీసుకున్నారు. రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్‌కు చోటు కల్పించారు. మయాంక్ తన ఫస్ట్ టెస్ట్ ఆడబోతున్నాడు. నాలుగు టెస్ట్‌ ల సిరీస్‌ లో రెండు టీమ్స్ 1-1తో సమంగా ఉన్నాయి.

మెల్‌ బోర్న్ టెస్ట్‌ కు టీమ్ ఇదే:

విరాట్ కోహ్లి, అజింక్య రహానే, మయాంక్ అగర్వాల్, హనుమ విహారి, చెతేశ్వర్ పుజారా, రోహిత్ శర్మ, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమి, ఇషాంత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా.

 

Posted in Uncategorized

Latest Updates