ఆస్తమాను తగ్గించే బ్రౌన్ రైస్..

పాలిష్‌‌ చేసిన బియ్యం కన్నా.. దంపుడు బియ్యం (బ్రౌన్‌‌రైస్‌‌) బెటర్‌‌ అంటున్నారు డాక్టర్లు. ఈ రైస్‌ ‌తినడం వల్ల శరీరంలో షుగర్ లెవల్స్‌‌తగ్గుతాయని అదేవిధంగా ఈ రైస్ లో ఉండే సెలీనియం ఆస్తమా(ఉబ్బసం)కు వ్యతిరేకంగా పనిచేస్తుందని వారంటున్నారు. ఒక కప్పు బ్రౌన్ రైస్ లో దాదాపు 21శాతం మెగ్నీషియం ఉంటుంది. ఇందులోఉండే పీచు పదార్థం జీర్ణ వాహికలో క్యాన్సర్  రసాయనాలను  బయటకు పంపుతుంది.

ఇక  దీనిలో ఉండే థయామిన్‌, రైబోఫ్లేవిన్, సయనకోబాలమిన్ అనే విటమిన్లు నరాలకు శక్తినిస్తాయి. బ్రౌన్‌‌రైస్‌ ‌ఊకలో లభ్యమయ్యే నూనె కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. వయసు మళ్లిన మహిళలపై జరిపిన అధ్యయనంలో బ్రౌన్‌‌రైస్‌‌ లాంటివి తినడం వల్ల ఎంటరోల్యాక్టోన్‌‌ స్థాయి పెరుగుతుందని  తెలిసింది.

Posted in Uncategorized

Latest Updates