ఆస్తి కోసం హైడ్రామా : బతికుండగానే డెత్ సర్టిఫికెట్

బతికున్న ఓ ఉద్యోగికి చనిపోయినట్లు డెత్ సర్టిఫికెట్ జారీ చేశారు కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు. నగరంలోని అంబేద్కర్ నగర్ లో నివసించే సయ్యద్ జమాలుద్దీన్… ఆయుష్ హెల్త్ డిపార్ట్ మెంట్ లో ఫోర్త్ క్లాస్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అయితే జమాలుద్దీన్ జనవరి 11, 1977లోనే చనిపోయినట్టు… గత ఏడాది నవంబర్ లో సర్టిఫికెట్ ఇచ్చారు అధికారులు.

దానిపై మున్సిపల్ కమీషనర్ సంతకం కూడా ఉండడం గమనార్హం. జమాలుద్దీన్, అతని సోదరునికి ఆస్తి వివాదాలు ఉండడంతో… ఆ కుట్రలో భాగంగానే ఈ సర్టిఫికెట్ వచ్చిందని ఆరొపిస్తున్నాడు జమాలుద్దీన్. సోదరుని కొడుకైన ఇలియాసుద్దీన్… ఆస్తిని కాజేసేందుకు ఇలా ఫేక్ సర్టిఫికెట్ ను పొంది కోర్టులో కేసు వేసారని చెబుతున్నాడు. తాను బతికుండగానే చనిపోయినట్లు సర్టిఫికెట్ జారీ చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాడు.

 

Posted in Uncategorized

Latest Updates