ఆస్పత్రిపై ఉగ్రదాడి : పాక్ టెర్రరిస్ట్ నవీద్ ఎస్కేప్

aniకశ్మీర్ లో ఉగ్రవాదుల ఆగడాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. బోర్డర్ లో సెక్యూరిటీ సిబ్బందిపై దాడి చేయడమే కాక మంగళవారం (ఫిబ్రవరి 6) ఏకంగా హాస్పిటల్ లో ఉన్న పోలీసులపై కాల్పులు జరిపారు. పాకిస్తాన్ కు చెందిన నవీద్ అనే ఉగ్రవాదిని కొన్ని నెలల క్రితం పోలీసులు అరెస్ట్ చేశారు. జైలు శిక్షను అనుభవిస్తున్న నవీద్ ను సోమవారం పోలీసులు శ్రీనగర్ లోని శ్రీ మహారాజా సింగ్ హాస్పిటల్ కు వైద్య పరీక్షల నిమిత్తం తీసుకొచ్చారు. అదే అదునుగా భావించిన ఉగ్రవాదులు హాస్పిటల్ లోనికి ప్రవేశించి పోలీసులపై కాల్పులు జరిపారు. టెర్రరిస్ట్ నవీద్ ను తప్పించారు. ఈ సమయంలో నవీద్ అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఈ కాల్పుల్లో ఇద్దరు పోలీసులు చనిపోగా, మరో పోలీస్ తీవ్రంగా గాయపడ్డాడు. నవీద్‌ కోసమే ఈ దాడి జరిగి ఉంటుందని పోలీసులు అంటున్నారు.

0115166BRK-KASH95

Posted in Uncategorized

Latest Updates