ఆస్పత్రి నుంచి ఇంటికి : మేం బతకటం ఓ అద్భుతం

థాయ్ లాండ్ లోని లువాంగ్ గుహల్లో చిక్కుకుని తొమ్మిది రోజులు ఆహారం లేకుండా బతికిన థాయ్ అండర్ 16 ఫుట్ బాల్ జట్టు పిల్లలను మీడియా ఎదుట చూపించింది ప్రభుత్వం. 12 మంది పిల్లలు, కోచ్ ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. పిల్లలు ఇంటికి వెళ్లే ముందు.. వారిని అందరికీ పరిచయం చేశారు. కొద్దిసేపు వారు ఫుట్ బాల్ తో ఆడారు. పిల్లల ఇళ్లకు వెళ్లి వారిని ఇంటర్వ్యూలు చేయొద్దని ప్రభుత్వం ఆదేశించింది. ఎవరైనా ఇంటర్వ్యూలు చేసినట్లయితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మరీ హెచ్చరించింది.

మీడియాతో పిల్లలు ఇలా అన్నారు :

… జూన్ 23వ తేదీ ఫుట్ బాల్ ప్రాక్టీస్ చేసిన చేసిన తర్వాత సాయంత్రం.. గుహలోకి వెళ్లాం. అలా వెళ్లిన గంటకే వర్షం పడింది. ఒక్కసారిగా గుహలోకి వరద పోటెత్తింది. నీళ్ల నుంచి తప్పించుకోవటానికి గుహలోకి అలాగే వెళ్లిపోయాం. ఎంత దూరం వెళ్లామో కూడా తెలియదు.

… అలా కొద్దిదూరం వెళ్లిన తర్వాత ఓ ఎత్తయిన ప్రదేశంలో ఉండిపోయాం. ఎక్కడ ఉన్నామో కూడా తెలియలేదు. పగలు – రాత్రి తేడా తెలియలేదు. చాలా భయం వేసింది.

… రెండు రోజులకే మా కడుపులు ఖాళీ అయిపోయాయి. ఆకలి మొదలైంది. ఆహారం లేదు. కొండల్లోని రాళ్ల నుంచి వచ్చే వర్షపు నీటినే తాగుతూ బతికాం.

… ఎవరైనా వచ్చి రక్షిస్తారనే ఆశ ఉంది. అప్పటి వరకు ధ్యానం ద్వారా ఒంట్లోని శక్తితోనే బతికేశాం. రోజులు గడిచే కొద్దీ బతుకుతాం అనే ఆశ లేకుండా పోయింది.

… ఎలా బతికామో కూడా అర్థం కావటం లేదు.. ఇద్దరు బ్రిటీష్ డైవర్లు మమ్మల్ని గుహలో గుర్తించటం అద్భుతంగా ఉంది. మాకు ప్రాణం లేచి వచ్చింది. బతుకుతాం అనే ఆశ వచ్చింది.

… గుహ నుంచి ఎవరు ముందు బయటకు వెళ్లాలి అనే విషయాన్ని కోచ్ డిసైడ్ చేశారు. ఆయన సెలక్ట్ చేసిన పిల్లలనే ముందుగానే బయటకు తీసుకొచ్చింది రెస్క్యూ టీం.

… రెస్క్యూ ఆపరేషన్ లో చనిపోయిన డైవర్ సమన్ గునన్ కు నివాళులర్పించారు పిల్లలు. అతను చనిపోవటానికి కారణం మేమే అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు పిల్లలు.

ఇంటికి వెళ్లే పిల్లలపై ఆంక్షలు విధించారు డాక్టర్లు. మరో 15 రోజులు డైట్ ఫాలో కావాలని ఆదేశించారు. ఎవరికీ ఇంటర్వ్యూలు ఇవ్వొద్దని ఆదేశించారు.

Posted in Uncategorized

Latest Updates