ఆ ఇద్దరికే రాఫెల్ డీల్ గురించి తెలుసు : కపిల్ సిబల్

రాఫెల్ డీల్‌ పై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. దేశ భద్రత విషయంలో బీజేపీ రాజీపడిందని కాంగ్రెస్ ఆరోపించింది. రాఫెల్ ఇష్యూపై మంగళవారం(సెప్టెంబర్-25) మాట్లాడారు కాంగ్రెస్ సీనియర్ లీడర్ కపిల్ సిబల్.
రాఫెల్ డీల్ గురించి ఇద్దరికి మాత్రమే తెలుసన్నారు సిబల్. అందులో ఒకరు మోడీ, మరొకరు అప్పటి ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండే అని సిబాల్ అన్నారు. మోడీ ప్రకటించిన కొత్త డీల్ గురించి అప్పటి రక్షణ మంత్రి మనోహర్ పారికర్‌ కు కానీ, అరుణ్ జైట్లీకి కానీ , నిర్మలా సీతారామన్‌ కు గానీ తెలియదని అన్నారు. 2015 ఏప్రిల్- 8న భారత విదేశాంగ కార్యదర్శి ఒక ప్రకటనలో ఏప్రిల్- 10న ప్రధాని జరిపే పర్యటనలో రాఫెల్ డీల్ చర్చలకు రాదని తెలిపిన విషయాన్ని సిబల్ గుర్తు చేశారు. అయితే ప్రధాని మాత్రం 36 రాఫెల్ విమానాల డీల్‌ పై ప్రకటన చేసేశారని, ఆయన ఆ ప్రకటన చేస్తారని ఎవరికీ తెలియదని సిబాల్ అన్నారు. HAL తో కాంట్రాక్ట్ ఫైనలైజ్ అయినట్టు 2015 మార్చి- 25న ఎరిక్ ట్రాపియర్ తెలిపిందని, ఆ తర్వాతే మార్చి- 28న రిలయెన్స్ డిఫెన్స్ వచ్చి చేరిందన్నారు. ఏప్రిల్- 10నే ఎవరికీ చెప్పకుండా మోడీ రాఫెల్ డీల్ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందని సిబల్ ప్రశ్నించారు. దేశ భద్రత కోసం 126 రాఫెల్స్‌ ను తీసుకురావాల్సిందేనన్నారు సిబల్.

Posted in Uncategorized

Latest Updates