ఆ ఇల్లు ఓ నిధి : 163 కోట్ల డబ్బు.. 100 కేజీల బంగారం ఇలా దాచారు

మీ ఇంట్లో డబ్బులు ఎంత ఉన్నాయి అంటే ఓ రెండు, మూడు వేలు ఉంటాయి.. అదే ఓ ధనవంతుడిని అడిగితే ఓ నాలుగు, ఐదు కోట్ల డబ్బు ఉంది అంటారు.. అదే బ్యాంకులను అడిగితే.. ఓ 20, 30 కోట్ల క్యాష్ ఉంది అంటోంది.. కానీ ఆ ఇంటిని చూస్తే మాత్రం కళ్లు తిరిగి పడిపోతారు.. RBI.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర కూడా అప్పటికప్పుడు అంత డబ్బు ఉండదేమో.. అవును ఇది పచ్చినిజం.. దొరికిన డబ్బు, బంగారం సాక్షిగా దేశం మొత్తం నివ్వెరపోయిన అతిపెద్ద ట్రెజర్ హంట్ దొరికింది. ఐటీ దాడుల్లో దొరికిన అతి పెద్ద అమౌంట్ ఇదే కావటం విశేషం.

తమిళనాడు ప్రభుత్వ కాంట్రాక్టర్ సెయ్యాదురై(60) ఆఫీసులు, ఇళ్లలో రెండు రోజులుగా సాగుతున్న తనిఖీల్లో అధికారులు కళ్లు తిరిగి పడిపోయారు. డబ్బే రూ.163 కోట్ల వరకు గుర్తించారు. ఇంత డబ్బు ఇళ్లు, ఆఫీసుల్లో ఎలా పెట్టుకున్నారో కూడా అర్థం కావటం లేదు అధికారులు. అన్నీ 2000, 500 రూపాయల నోట్లు. బ్యాంక్ సీల్ కూడా ఓపెన్ చేయలేదు. నోట్ల రద్దు తర్వాత కూడా ఇంత పెద్ద మొత్తంలో డబ్బు ఎలా నిల్వ చేసుకున్నాడు అనేది అధికారులకు సైతం ఆశ్చర్యం కలిగిస్తోంది. కట్టలుగా ఉన్న డబ్బును లెక్క పెట్టటానికి భారీ కౌంటింగ్ మెషీన్స్ తీసుకొచ్చారు. ఇంట్లోని బీరువాలు, అల్మార్లు, పరుపులు, మంచాల కింద ఎక్కడ చూసిన డబ్బు సూట్ కేసులే.. ఏ బ్యాగ్ ఓపెన్ చేసినా.. నోట్ల కట్టలు కనిపించటంతో షాక్ అవుతున్నారు అందరూ.

ఒక్క నోట్ల కట్టలే కాదు.. బంగారమే 100 కిలోలు ఉంది. అంతా కూడా బిస్కెట్ల రూపంలో ఉంది. 100 కిలోలు అంటే.. మాటలు కాదు.. పెద్ద పెద్ద బంగారం షాపులు సైతం 100 కేజీల బంగారాన్ని పెట్టుకోరు. అలాంటిది సెయ్యాదురై అంత బంగారాన్ని ఎలా పెట్టుకున్నాడో కూడా ఎవరికీ అంతు పట్టటం లేదు. రూ.163 కోట్ల డబ్బు, 100 కేజీల బంగారం మాత్రమే కాదు.. వేల కోట్ల విలువ చేసే ఆస్తులకు సంబంధించి డాక్యుమెంట్లు కూడా లభ్యం అయ్యాయి. ప్రస్తుతం ఇదంతా లెక్కించే పనిలో చాలా బిజీగా ఉన్నారు ఐటీ అధికారులు.

Posted in Uncategorized

Latest Updates