ఆ ఏడు సంస్థ‌ల‌కే..ప్రిన్స్ హ్య‌రీ పెళ్లి కానుకలు

harryపెళ్లి టైంలో వచ్చిన గిఫ్ట్ లను ఆయా దంపతులు..వారి గుర్తుగా తమ దగ్గరే పెట్టుకుంటారు. బ్రిటన్‌ రాకుమారుడు ప్రిన్స్‌ హ్యారీ మాత్రం తమ మ్యారేజ్ సమయంలోవచ్చే కానుక‌ల‌న్నీ స్వ‌చ్ఛంద సంస్థ‌ల‌కు ఇవ్వాల‌ని నిర్ణయం తీసుకున్నారు. ప్రముఖ హాలీవుడ్‌ నటి మేగన్‌ మార్కెల్ ను మే 19న హ్యారీ వివాహం చేసుకోనున్నారు. అయితే పెళ్లి సంద‌ర్భంగా తమకు వచ్చే కానుకలన్నీ ఏడు స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇవ్వాలని హ్యారీ, మేగన్‌ మార్కెల్‌ డిసైడ్ అయ్యారు. ఏడు స్వచ్ఛంద సంస్థల్లో ముంబైలోని ‘మైనా మహిళా’ అనే స్వచ్ఛంద సంస్థ కూడా ఉంది. గతేడాది భారత్ కు వచ్చిన మార్కెల్ ఈ ఫౌండేషన్‌ను సందర్శించారు.

Posted in Uncategorized

Latest Updates