ఆ ఏడేళ్లు ఎక్కడ చదివితే అదే లోకల్

telangana-employeesలోకల్…నాన్ లోకల్ కు  ఏ అంశాన్ని లెక్కలోకి తీసుకోవాలనే దానిపై తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ చర్చింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో స్థానికతను నిర్ధారించేందుకు 4 నుంచి 12వ తరగతి వరకు ఎక్కడ చదితే అదే వారి లోకల్ గా స్పష్టం చేసింది. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కమిటీ సిఫారసు చేసిన విధంగా ఒకటో తరగతి నుంచి 7వ తరగతి వరకు చదువును లెక్కలోకి  తీసుకోవద్దని తెలిపింది. 4 నుంచి 12 దాకా వరుసగా ఏడేళ్ల పాటు ఏ జిల్లాలో చదివితే ఆ జిల్లాకు లోకల్‌గా పరిగణించాలని సూచించింది. ఒకవేళ విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లో చదివితే వారి తల్లిదండ్రుల స్థానికతను లెక్కలోకి తీసుకోవాలని తెలిపింది. బుధవారం(మే-23) టీఎన్‌జీవో భవన్‌లో చైర్మన్‌ కారెం రవీందర్‌రెడ్డి అధ్యక్షతన ఉద్యోగ సంఘాల జేఏసీ సమావేశం జరిగింది.

జోనల్‌ విధానం, స్థానికతపై పలు తీర్మానాలు ఆమోదించారు. తర్వాత జోనల్‌ విధానం ఉండాల్సిన తీరుపై ప్రతిపాదనలను సిద్ధం చేశారు. 4 జోన్ల విధానంతో విద్యార్థులకు, నిరుద్యోగులకు నష్టం జరుగుతుందని… కనీసం 5 జోన్లు ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. 6 జోన్లు ఉన్నా ఓకేనంది. పాత జిల్లా ప్రకారం ప్రస్తుతం ఉన్న రెండు జోన్లను రెండు మల్టీ జోన్లుగా చేయాలని ప్రతిపాదించింది. అలాగే అన్ని కేటగిరీల పోస్టుల్లో 80% లోకల్, 20% ఓపెన్‌ కేటగిరీ (రాష్ట్ర పరిధిలోని వారికే) విధానం ఉండాలని, లేదంటే 70:30 నిష్పత్తిన ఉండాలని తెలిపింది. వీటిపై గురువారం లేదా శుక్రవారం సీఎంతో చర్చించే అవకాశం ఉంది.

Posted in Uncategorized

Latest Updates