ఆ ఒక్కరికి తప్ప : మాజీ సీఎంలకు బంఫరాఫర్

మధ్యప్రదేశ్ ముగ్గురు మాజీ సీఎంలు… ఉమాభారతి, కైలాష్ చంద్ర జోషి, బబులాల్ గౌర్ లు గర్నమెంట్ బంగ్లాలలోనే నివసించేందుకు అనుమతించారు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ తో సహా ముగ్గరు మాజీ సీఎంలు గవర్నమెంట్ బంగ్లాలను ఖాళీ చేయాలని సుప్రీం సూచించింది. అయితే తన విచక్షణా అధికారాన్ని ఉపయోగించి సీఎం శివరాజ్ సింగ్ ముగ్గరు మాజీ సీఎంలకు గవర్నమెంట్ బంగ్లాలో నివసించేందుకు అనుమతిచ్చారు. మాజీ కాంగ్రెస్ సీఎం దిగ్విజయ్ సింగ్ మాత్రం ఈ లిస్ట్ లో లేడు.

మాజీ సీఎంలు గవర్కమెంట్ బంగ్లాలను ఖాళీ చేయాలని ఇటీవల సుప్రీం కోర్టు తెలిపిన విషయం తెలిసిందే. యూపీ మాజీ సీఎంలు అఖిలేష్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్ లు కూడా ఇటీవల సుప్రీం కోర్టు ఆర్డర్ తో గవర్నమెంట్ బంగ్లాలను ఖాళీ చేశారు. అయితే గవర్నమెంట్ బంగ్లాలోని ఖరీదైన ఫర్నీచర్ ను కూడా తమతో తీసుకెళ్లారు అఖిలేష్ యాదవ్.

Posted in Uncategorized

Latest Updates