ఆ చంద్రబాబు జాడ చెబితే రూ.లక్ష : వర్మ బంపర్ ఆఫర్

కాంట్రవర్సీల్లో ముందుండే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ..ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబుపై పడ్డాడు. రెండ్రోజులుగా అచ్చం చంద్రబాబులాగే ఉన్న ఓ వ్యక్తి భోజనం చేస్తున్న వారికి చట్నీ వడ్డిస్తూ కనిపించారు. అయితే..అతడి ఆచూకి తెలిపినవారికి బంపర్ ఆఫర్ ప్రకటించాడు వర్మ. ఈ సందర్భంగా ఈ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేసి ట్వీట్ చేశాడు. ఈ వ్యక్తి ఎవరో కనిపెట్టేందుకు నాకు ఎవరైనా సహాయం చేస్తారా.. ఆయన్ను నాకు పరిచయం చేసిన వ్యక్తి ఎవరైనా సరే వారికి రూ.లక్ష బహుమతిగా ఇస్తా.

ఆయన ఆచూకీ దొరికితే నా ఈ మెయిల్‌ Lakshmisntr@gmai.com  కు  వివరాలు పంపండి. మొదట సమాచారం పంపిన వ్యక్తికే రూ.లక్ష అందుతుంది అని ట్వీట్ చేశాడు వర్మ. చంద్రబాబులా ఉన్న అతడి వివరాలు ఇంకా తెలియరాలేదు. వర్మ ఆఫర్ తోనైనా అతడి వివరాలు తెలిసే అవకాశం ఉందంటున్నారు నెటిజన్లు. ప్రస్తుతం ఈ విడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వైరల్ గా మారింది. తన తర్వాతి సినిమా లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ లోని క్యారెక్టర్ కోసం వర్మ వీడియోలో ఉన్న వ్యక్తిని వెతుకుతున్నట్లు చెప్పుకొచ్చారు నెటిజన్లు. వివరాలు తెలిస్తే తప్పక సమాచారం ఇస్తామని అన్నారు. ఎన్టీఆర్‌, ఆయన సతీమణి లక్ష్మీ పార్వతి జీవితం ఆధారంగా.. లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమాను తీయనున్నాడు వర్మ. అక్టోబరు 19న తిరుపతిలో సినిమా ప్రారంభోత్సవాన్ని నిర్వహించనున్నట్లు తెలిపాడు. సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తానన్నాడు.

Posted in Uncategorized

Latest Updates