ఆ చిన్నారి ధైర్యం అధ్భుతం

camతెలివిగా వ్యవహరించిన ఓ 8 ఏళ్ల చిన్నారి ఓ ఎద్దు రూపంలో వచ్చిన ప్రమాదం నుంచి తన తమ్డిని కాపాడింది. కర్ణాటక రాష్ట్రంలోని కార్వార జిల్లాలోని నవిలాగన్ గ్రామంలో మంగళవారం(ఫిబ్రవరి13) జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నవిలాగన్ గ్రామానికి చెందిన కిరణ్ సేత్ అనే వ్యక్తికి ముగ్గురు పిల్లలున్నారు. మంగళవారం స్కూల్ కి హాలీడే ఇవ్వడంతో ఇంటి దగ్గరే ఉన్న ఆ ముగ్గురిలో పెద్దదైన ఆరతి(8) తన తమ్ముడు కార్తీక్(2) ను ఇంటి ఆవరణలో ఆడిస్తుంది. ఇంతలో వేగంగా పరుగెత్తుకుంటూ ఓ ఎద్దు ఎరుపు రంగు చొక్కా వేసుకొన్న ఆ రెండేళ్ల చిన్నారిపై దాడి చేయడానికి ప్రయత్నించింది. అయితే తన అక్క ఆరతి తెలివిగా వ్యవహరించడంతో ఆ చిన్నారి చావు నుండి తప్పించుకున్నాడు. అక్కడే ఉన్న సీసీ కెమెరాలో ఇదంతా రికార్డ్ అయింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆరతి ప్రదర్శించిన ధైర్యం అధ్భుతం అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు.
https://youtu.be/b6QsmQeFP-A

Posted in Uncategorized

Latest Updates