ఆ జవాన్ అంతిమయాత్రలో లక్షలాది మంది

sachinఎవరైనా చనిపోతే ఆ కుటుంబానికి సంబంధించిన బందువులు..స్నేహితులు చివరి సారి చూసేందుకు వస్తారు. అంత్యక్రియల్లో పాల్గొని వెళ్లిపోతారు. అయితే దేశం కోసం ప్రాణాలర్పించిన ఓ వీర జవాన్ అంతిమ యాత్రలో పాల్గొనేందుకు బంధవులు, స్నేహితులు,గ్రామ ప్రజలతో పాటు చుట్టు పక్క గ్రామాలనుంచి లక్షలాదిగా ప్రజలు కూడా తరలి వచ్చారు. ఘనంగా నివాళులర్పించారు. ఆయన దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ ఘటన హరియాణాలో జరిగింది.

పానిపత్‌ జిల్లా గోయ్లాకుర్ద్‌ గ్రామానికి చెందిన సచిన్‌ శర్మ (20) గత 2016 డిసెంబరు 12న ఆర్మీ ఉద్యోగంలో చేరాడు. ఉత్తరప్రదేశ్‌లోని రాజ్‌పుతనా రెజిమెంట్‌లోని 16వ బెటాలియన్‌లో ట్రైనింగ్ పూర్తి చేసుకొని 2017 నవంబర్‌ 16 తేదీన అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఉద్యోగంలో చేరాడు. ఫిబ్రవరి 5న రెండు నెలల సెలవుపై తన సొంతూరు రావాల్సి ఉంది. అయితే .. అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తవాంగ్‌ ప్రాంతంలో జనవరి 13 జరిగిన ఉగ్రవాదుల దాడిలో సచిన్‌ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ జనవరి 16న తుదిశ్వాస విడిచాడు. జనవరి 18న భౌతిక ఖాయం స్వగ్రామానికి చేరుకుంది.

విషయం తెలుసుకున్న వెంటనే బంధువులు, ఆత్మీయులతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున గోయ్లాకుర్ద్‌ గ్రామానికి చేరుకున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. దాదాపు లక్షమంది బైకులపై ర్యాలీగా వచ్చి అమర వీరుడికి ఘన నివాళి అర్పించారు. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

శర్మకు తల్లిదండ్రులతో పాటు ఇద్దరు అక్కచెళ్లెల్లు, ఒక తమ్ముడు ఉన్నారు.

Posted in Uncategorized

Latest Updates