ఆ జిల్లాలో విద్యుత్ వినియోగం ఎక్కువ

 వెలుగు నెట్ వర్క్ : రాష్ట్ర ప్రభుత్వం 5000 మెగావాట్ల  సౌర విద్యుత్ సామర్థ్యం లక్ష్యంగా 2015లో సౌర విద్యుత్ విధానాన్ని ప్రకటించింది. రాష్ట్రంలో తలసరి విద్యుత్ వినియోగం అధికంగా ఉన్న జిల్లా మెదక్ అని తెలిపింది.  రాష్ట్రంలోనే ఇది మొట్టమొదటి సౌర విద్యుత్ కేంద్రంగా ప్రకటించింది.

దీనిని జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం రేవులపల్లి గ్రామంలో స్థాపించారు. జవహర్‌‌లాల్ నెహ్రూ జాతీయ సోలార్ మిషన్‌‌ లో భాగంగా నిర్మించారు. 2011 డిసెంబర్ 29న ఇది ఉత్పత్తి ప్రారంభించింది. దీనిని టీఎస్ జెన్‌ ‌కో నిర్వహిస్తుంది. ఈ సోలార్ పవర్ సామర్థ్యం 1 మెగావాట్. సౌర విద్యుత్ సామర్థ్యంలో 2014-–15, 2015–16 సంవత్సరాలలో దేశంలోనే తెలంగాణ 2వ స్థానంలో నిలిచింది.

విద్యుత్ వినియోగంలో అత్యల్పంగా  ఆదిలాబాద్ జిల్లా ఉంది. గృహ అవసరాలకు అధికంగా విద్యుత్‌‌ని వినియోగిస్తున్న జిల్లా హైదరాబాద్, వినియోగం తక్కువ గల జిల్లా మహబూబ్‌ నగర్. వ్యవసాయ అవసరాలకు అధికంగా విద్యుత్‌‌ని వినియోగిస్తున్న జిల్లా నల్లగొండ, అల్పంగా వినియోగిస్తున్న జిల్లా రంగారెడ్డి. పారిశ్రామిక అవసరాలకు అధికంగా విద్యుత్‌‌ని వినియోగిస్తున్న జిల్లా రంగారెడ్డి, అల్పంగా వినియోగిస్తున్న జిల్లా వరంగల్.

Posted in Uncategorized

Latest Updates