ఆ తండా వాసులు ఎన్నికలను బహిష్కరించారు

గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చక పోగా….తమ తండాకు కనీస వసతులు  కల్పించలేదు నాయకులు. దీంతో ఆ తండా వాసులు ఇవాళ (శుక్రవారం) జరుగుతున్న ఎన్నికలను బహిష్కరించారు. ఎన్నికల్లో తాము తమ ఓటును వేసేది లేదని తేల్చిచెప్పారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలోని కోదాడ నియోజకవర్గంలోని రంగాపురం తండాలో జరిగింది. శుక్రవారం జరుగుతున్న ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోకుండా బహిష్కరించారు. తమ గ్రామాన్ని ఎవరూ పట్టించుకోలేదని, అందుకే తాము ఓటేయకుండా మూకుమ్మడిగా ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. సమాచారమందుకున్న అధికారులు తండాకు చేరుకుని తండా వాసులతో చర్చించారు. ఓటు వేయాల్సిందిగా సూచించారు.

Posted in Uncategorized

Latest Updates