ఆ తల్లికి ఎంతకష్టం: అంత్యక్రియలకు డబ్బుల్లేక

నవమాసాలు మోసి… శిశువుకు జన్మనిచ్చింది ఓ తల్లి. ఆ తల్లి సంతోషం  ఎన్నోరోజులు నిలవలేదు.పుట్టిన కొద్ది రోజుల్లోనే గుండె సంబంధిత వ్యాధితో కన్నుమూసింది. తన బిడ్డ అంత్యక్రియలకు డబ్బులు లేకపోవడంతో ఆ తల్లి జాతీయ రహదారిపైనే వదిలేసి వెళ్లిపోయింది. ఈ దారుణమైన ఘటన జార్ఖండ్‌ బొకారో జిల్లాలో జరిగింది. ధన్‌బాద్‌కు చెందిన డాలీ అనే మహిళ గత నెల 30న బొకారో జిల్లాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అక్టోబర్‌ 1న శిశువుకు గుండె సంబంధిత వ్యాధి ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. చికిత్సకు రోజుకు రూ. 8వేలు వసూలు చేస్తుండటంతో ఆమెకు శక్తికి మించిన భారంగా మారింది. దీంతో అనారోగ్యంగా ఉన్న శిశువును ఆస్పత్రి నుంచి  ఇంటికి తీసుకెళ్లుతుండగా కన్నుమూసింది. అంత్యక్రియలకు కూడా డబ్బులు లేక కన్న బిడ్డను ప్లాస్టిక్‌ కవర్‌లో చుట్టి జాతీయ రహదారి పక్కన పడేసింది.

రోడ్డుపై శిశువు ఉన్న కవర్ ను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. శిశువు మృతదేహం ఉన్న చోటుకు చేరుకున్న పోలీసులు కవర్‌పై ఉన్న ఆస్పత్రి లోగో ఆధారంగా వివరాలు సేకరించి డాలీని అదుపులోకి తీసుకున్నారు. అంత్యక్రియలకు డబ్బులేని కారణంగానే మరణించిన బిడ్డను అలా రోడ్డు పక్కన పడేశానని డాలీ తెలిపింది. ఇప్పటికే కాన్పు ఖర్చుల కోసం అప్పులు చేయాల్సివచ్చిందని చెప్పుకొచ్చింది.

Posted in Uncategorized

Latest Updates