ఆ దేశానికి మొదటిసారి : మోడీ ఆఫ్రికా దేశాల పర్యటన షెడ్యూల్ ఇదే

ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఆఫ్రికా ఖండంలోని మూడు దేశాల్లో మోడీ పర్యటించనున్నారు. బుధవారం(జులై-23)నుంచి మోడీ విదేశీ పర్యటన మొదలవుతుంది. 23న రువాండ దేశంలో మోడీ పర్యటిస్తారు. గురువారం(జులై-24) ఉగాండా దేశంలో మోడీ పర్యటిస్తారు. తరువాత మోడీ సౌతాఫ్రికాకు వెళ్తారు. సౌతాఫ్రికాలోని జోహెన్స్ బర్గ్ సిటీలో జరిగే బ్రిక్స్ దేశాల సమావేశంలో మోడీ పాల్గొంటారు. అయితే చరిత్రలో తొలిసారిగా ఓ భారత ప్రధాని రువాండ దేశాన్ని సందర్శించడం ఇదే మొదటిసారి. రువాండ దేశంలో పర్యటించనున్న తొలి భారత ప్రధానిగా మోడీ నిలిచారు.

Posted in Uncategorized

Latest Updates