ఆ దొంగలను పట్టించినవారికి భారీ నజరాన : పోలీసులు

POLICEదొంగల సమాచారాన్ని తెలిపినవారికి భారీ నజరాన ప్రకటించారు హైదరాబాద్ పోలీసులు. ఇటీవల హైదరాబాద్‌ శివారు బీరంగూడలో సంచలనం సృష్టించిన నగల దుకాణం దోపిడి కేసులో పోలీసుల దర్యాప్తు వేగవంతమైంది. దోపిడికి పాల్పడిన వారు అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన వారుగా పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుల ఫొటోలను విడుదల చేసిన పోలీసులు వారిని పట్టుకోవడానికి ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నగల దుకాణాన్ని క్లూస్‌ టీం పరిశీలించింది. నిందితులు పథకం ప్రకారమే రెక్కీ నిర్వహించి, ఆభరణాల దుకాణం యజమానిని బంధించారనీ… బీరువాలో దాచిన కిలో బంగారం, నాలుగున్నర లక్షల రూపాయలతో ఉడాయించారనీ అనుమానిస్తున్నారు. నిందితుల గురించి సమాచారం అందిస్తే లక్ష రూపాయల బహుమతి అందిస్తామని ప్రకటించారు పోలీసులు.

Posted in Uncategorized

Latest Updates