ఆ నటికి సల్మాన్ ఆర్ధిక సాయం

Salmanబాలీవుడ్ హీరో స‌ల్మాన్ ఖాన్ స‌ర‌స‌న న‌టించిన పూజ ద‌డ్వాల్ ప్ర‌స్తుతం క్ష‌య వ్యాధితో బాధ‌ప‌డుతోంది. క్ష‌యతో పూజా గ‌త 15 రోజులుగా ఆస్పత్రిలోనే ఉంటూ చికిత్స తీసుకుంటుంది. ప్రస్తుతం  వైద్యం చేయించుకోవడానికి డబ్బుల్లేని స్థితి ఆమెది. సల్మాన్‌ సాయం కోసం ఆమె గతంలో మీడియా ద్వారా వేడుకోగా.. ఎట్టకేలకు ఆ విషయం సల్మాన్‌కి తెలిసింది.

విషయం తెలుసుకున్న సల్మాన్… పూజ ద‌డ్వాల్ ప‌రిస్థితి తెలుసుకొని చాలా బాధ‌ప‌డ్డానన్నారు. సాధ్యమైనంత ఎక్కువ సహాయం చేయ‌టానికే ప్రయత్నిస్తానని… ఆరోగ్యంతో పూజా దద్వాల్‌ బయటకు వస్తుందనే నమ్మకం ఉందన్నారు సల్మాన్. రేసు గుర్రం చిత్రంలో విల‌న్‌గా న‌టించిన ర‌వి కిషన్‌ తన స్నేహితుడైన ఉదయ్‌ భగత్ అనే వ్యక్తి ద్వారా వారం క్రితం పూజాకి సాయం చేశారు. చికిత్సకు కావాల్సిన డబ్బుతో పాటు పండ్లు కూడా పంపిణీ చేశారు.

సినిమాల్లో అవకాశాలు లేక పోవడంతో ఇండస్ట్రీని వదిలిపెట్టిన పూజా.. గత కొన్నేళ్లుగా గోవాలో క్యాసినో మేనేజ్మెంట్ చేస్తూ సాధారణ జీవితం గడుపుతున్నారు. ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొంటూనే జీవనం సాగిస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates