ఆ పరిస్ధితుల్లో కూడా : రెస్క్యూ ఆపరేషన్లకూ పన్ను విధించిన ఉత్తరాఖాండ్

శనివారం ఉత్తరాఖాండ్ సివిల్ ఏవియేషన్ డెవలప్ మెంట్ అథారిటీ(UCADA) విడుదల చేసిన ఓ నోటిఫికేషన్..ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రజల తీవ్ర ఆగ్రహానికి గురౌతుంది. ఆ నోటిఫికేషన్ లో….విపత్తుల సమయంలో రెస్యూ ఆపరేషన్ చేసి ఫితోఘర్ లో హెలికాఫ్టర్ ఎక్కించబడిన ప్యాసింజర్లు ఒక్కొక్కరు… జీఎస్టీతో కలిపి 3 వేల 100 రూపాయలను డబ్బులు పే చేయాలని ఉంది. అంతేకాకుండా ఈ చార్జీలను వెంటనే ప్యాసింజర్లు పే చేయాల్సి ఉంటుందని ఆ నోటిఫికేషన్ లో ఉంది. ఈ ఆర్డర్ ను ఉత్తరాఖాండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ ఇప్పటికే ఆమోదించారు.
మొట్టమొదటిసారిగా రెస్క్యూ ఆపరేషన్లపై పన్ను విధిస్తున్న రాష్ట్రంగా ఉత్తారాఖాండ్ నిలిచింది. ప్రతి ఏడాది ఉత్తరాఖాండ్ కు ప్రపంచం నలుమూలల నుంచి యాత్రికులు వస్తుంటారు. అయితే ప్రతి ఏటా విపత్తులు రావడం కూడా కామన్. అయితే ఎందుకు ఈ చార్జీ అని, ఈ నిర్ణయం వలన రాష్ట్ర టూరిజంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైసా పైసా కూడబెట్టుకొని ఉత్తరాఖాండ్ లో ఉన్న ఆలయాలకు భక్తులు వస్తుంటారని, అటువంటి వారి దగ్గర రెస్క్యూ ఆపరేషన్ల సమయంలో డబ్బులు తీసుకోవడం అత్యంత నీచమైన పని అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2013లో వచ్చిన ఉత్తరాఖాండ్ లో వచ్చిన వరదల కారణంగా వేల సంఖ్యలు ప్రజలు పాణాలు కోల్పోయారు. ఆ సందర్భంలో పెద్ద ఎత్తున రెస్క్యూ ఆపరేషన్లు జరిగాయి. ఉత్తరాఖాండ్ సివిల్ ఏవియేషన్ డెవలప్ మెంట్ అథారిటీ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందని, రాష్ట్ర ఇన్ ఫ్రా స్ట్రక్చర్, హెలికాఫ్టర్లు కు మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుందని ఆ నోటిఫికేషన్ లో ఉంది. అయితే రెస్క్యూ ఆపరేషన్లు చేపట్టే ఆర్మీ,IAF కి చెందిన హెలికాఫ్టర్లకు మాత్రం ఎటువంటి చార్జీలు ఉండవు.

Posted in Uncategorized

Latest Updates