ఆ పాప పేరు చేతన : సీపీ నామకరణం

CPహైదరాబాద్‌, కోఠీ ప్రసూతి ఆస్పత్రి నుంచి అపహరణకు గురైన చిన్నారి.. క్షేమంగా తల్లి ఒడికి చేరడంతో ఏసీపీ చేతనతో కలిసి సీపీ అంజనీ కుమార్‌ ఆ ఆస్పత్రికి వచ్చారు. శిశువు తల్లి విజయను యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికైనా పాప విషయంలో జాగ్రత్తగా ఉండు. బిడ్డను బాగా చదివించి పోలీసు అధికారిని చేయాలి అని సూచించారు సీపీ.

అనంతరం నీ బిడ్డను ఎవరు కాపాడారో తెలుసా.. అని అడిగారు. తెలియదు.. చూపెట్టండి అని ఆమె కోరగా ..ఇదిగో ఈమేనంటూ ఏసీపీ చేతనను చూపారు. చేతనకు నమస్కరించిన విజయ ..నేను, నా బిడ్డ జీవితాంతం మీకు రుణపడి ఉంటాం మేడం అన్నది. పాపను తీసుకొచ్చేందుకు ఏసీపీ చేతన ఎంతో కృషి చేశారన్న సీపీ.. నీ బిడ్డకు ఆమె పేరే పెడుతున్నాను అంటూ చేతనా అనిపిలిచారు. ఆనందం వ్యక్తం చేసిన విజయ.. తాము పేదవారమే అయినా బాగా కష్టపడి బిడ్డను చదివించుకొని ఏసీపీ చేతనలా పోలీస్‌ అధికారిని చేస్తామని హామీ ఇచ్చింది.

 

Posted in Uncategorized

Latest Updates