ఆ భయం వెంటాడుతోంది : అరిష్ఠం అంటూ అడవిలోకి వెళ్లిన గ్రామస్తులు

VANAM LOKI VALASAభద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గిరిజన గ్రామస్థులు వనంలోకి వలస వెళతారు. అందరిలాగా సరదా కోసమో, వేడుక కోసమో కాదు. తమ ఊరు సుభిక్షంగా ఉండాలని దేవుళ్లను ప్రార్థించేందుకు… గొడ్డూగోద.. పిల్లాపీచూ అందరూ ఆ ఒక్క రోజు ఊరిని వదిలేస్తారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా అడవిలో గడుపుతారు. వంట, తిండి అన్నీ అక్కడే ఉంటాయి. భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట మండల పరిధిలోని తిరుమలకుంట గ్రామస్థులు మూడేళ్లకోసారి నిర్వహిస్తున్న ‘వలస పండుగ’ పేరుతో ఆదివారం ఊరును విడిచిపెట్టారు. పిల్లాపాపలు, వృద్ధులతో కలిసి ఉదయం ఆరింటికే వనానికి వెళ్లారు. అక్కడ వంటలు వండి, దేవుళ్లకు నైవేద్యాలు సమర్పించిన అనంతరం సామూహికంగా భోజనాలు చేశారు. పొద్దుగూకినంక గ్రామంలోకి అడుగుపెట్టారు. గ్రామానికి వచ్చిన తరువాత వాకిలి ఊడ్చి దీపాలు వెలిగించి, వాటికి నమస్కరించి ఇళ్లలోకి ప్రవేశించారు.
తిరుమలకుంట గ్రామస్థులు మూడేళ్లకోసారి తమ ఊరికి ఈ రకంగా విశ్రాంతినిస్తారు. అంటే వలస వెళ్లిన ఆ రోజు గ్రామంలో ఒక్కరు కూడా ఉండరు. వెళ్లినవారెవ్వరు కూడా సూర్యాస్తమయం వరకు ఆ గ్రామంవైపు కన్నెత్తి కూడా చూడరు. గ్రామం ఖాళీ అయిన తర్వాత గ్రామ దేవతలు ఊర్లోని వీధులు, ఇళ్ళల్లో సంచరిస్తారని.. దీంతో దుష్టశక్తులు ఏమైనా ఉంటే గ్రామాన్ని వదిలి పారిపోతాయని… అనారోగ్య బాధలు కూడా పోతాయని ఇక్కడి గిరిజనుల నమ్మకం.

Posted in Uncategorized

Latest Updates