ఆ మీడియా సంస్థలపై పవన్ ఆగ్రహం

pawan-media-channelsజనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ లపై ట్విట్టర్ వేదికగా విమర్శలు కురిపించారు. శ్రీరెడ్డి వివాదంలో తనపై బురద జల్లుతున్నారని ఆరోపించారు. తన తల్లిని కూడా దూషించే విధంగా తనను తిట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం (ఏప్రిల్-19) రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు వరుస ట్వీట్లతో సీరియస్ అయ్యారు పవన్.

2014 ఎన్నికల సమయంలో టీడీపీకి మద్దతుగా నిలబడినందుకు తనకు దక్కిన ప్రతిఫలమిదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియెట్ వేదికగా ఆరు నెలలుగా తనపై కుట్ర జరిగిందన్నారు. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్, లోకేష్ స్నేహితుడు రాజేష్ తో కలిసి తనపై కుట్రపన్నారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. పది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నారా లోకేష్ ఈ కుట్ర చేయించారు అని ట్విట్ చేశారు పవన్ కల్యాణ్. గత కొన్ని రోజులుగా జరుగుతున్న కొన్ని అంశాలను ప్రస్తావిస్తూ, చంద్రబాబు తనయుడు, ఏపీ మంత్రి నారా లోకేష్‌ పేరును ప్రస్తావిస్తూ, కొన్ని మీడియా సంస్థల పేర్లను సైతం ప్రస్తావిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్.

Posted in Uncategorized

Latest Updates