ఆ రనౌటే మా కొంప ముంచింది : కోల్ కతా

DKఒక్క రనౌట్ మా అంచనాలను తారుమారు చేసిందన్నారు కోల్ కతా నైట్ రైడర్స్ కెప్టెన్ దినేష్ కార్తీక్. IPL సీజన్ -11లో భాగంగా శుక్రవారం (మే-25)  జరిగిన క్వాలిఫయర్‌-2 మ్యాచ్ లో  హైదరాబాద్ చేతిలో కోల్ కతా ఓడిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశాడు డీకే. ఈ ఓటమిని జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉందన్నాడు.  సీజన్‌ చివరివరకు ఆకట్టుకున్నప్పటికీ కీలక మ్యాచ్‌ లో పరాజయం చెందడం నిరాశను మిగిల్చిందన్నాడు. సన్‌ రైజర్స్‌ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మంచి ఆరంభం లభించినప్పటికీ, కొన్ని చెత్త షాట్లతో పాటు ఒక రనౌట్‌ తమ ఓటమిపై ప్రభావం చూపిందన్నాడు.

ఇది మాకు మంచి టోర‍్నమెంట్‌ అని తెలిపిన డీకే.. ఫినిషింగ్‌ బాలేదన్నాడు. ఛేజింగ్‌  చేసే సమయంలో మాకు గొప్ప ఆరంభం లభించిందని.. దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయామన్నాడు. కొన్ని చెత్త షాట్లు మా కొంప ముంచాయని. తనతోపాటు నితీష్‌ రాణా, రాబిన్‌ ఉతప్పలు మ్యాచ్‌ ను ముగిస్తే బాగుండేదన్నాడు. దీంతో ఓటమి చూడాల్సి వచ‍్చిందని.. సన్‌ రైజర్స్‌ మాకంటే మెరుగ్గా రాణించి గెలుపును సొంతం చేసుకుందన్నాడు. ఈ IPLలో యువ క్రికెటర్లు వారికి వచ్చిన అవకాశాన్ని ఒడిసిపట్టుకున్నారని తెలిపాడు దినేశ్‌ కార్తీక్‌. కోల్ కతాతో 14 రన్స్ తేడాతో గెలిచిన హైదరాబాద్ ఆదివారం (మే-27) చెన్నైతో తలపడనుంది.

Posted in Uncategorized

Latest Updates