ఆ రాష్ట్రంలో స్థిరపడితే.. ఏడాదికి 10 వేల డాలర్లు ఇస్తారట

vermountstateఏ దేశమైన తమ దేశంలో పెట్టుబడులు పెట్టండి…పర్యాటక ప్రాంతాలను సందర్శించడి అని అంటాయి. కానీ అమెరికాలోని వెర్మాంట్‌ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా వినూత్న పథకం తీసుకొచ్చింది. ఎవరైనా ఇంటి నుంచే పని చేసే ఉద్యోగులు తమ రాష్ట్రంలో స్థిరపడేందుకు వస్తే వారికి  మొదటి మూడేళ్లు ఏడాదికి 10 వేల డాలర్లు స్టైఫండ్‌గా ఇస్తుంది. ఇంటి నుంచి పని చేసుకుంటారు కాబట్టి వారి ల్యాప్‌టాప్‌కు సంబంధించిన పరికరాల కొనుగోలుకు, ఇంటర్నెట్‌ కనెక్షన్‌ పెట్టుకునేందుకు, ఉద్యోగ నిమిత్తం అయ్యే ఖర్చుల కోసం ఈ మొత్తాన్ని ఇవ్వాలని నిర్ణయించింది.  ఇలా ఏడాదికి 10వేల డాలర్లు చొప్పున మూడేళ్లు ఇవ్వనుంది. అయితే ఈ పథకం వచ్చే ఏడాది జనవరి నుంచి అమల్లోకి రానుంది. రాష్ట్రానికి వచ్చే మొదటి 100మందికే ఈ పథకం వర్తిస్తుందట. ఆ తర్వాత ఏటా 20మందికి ఈ పథకం వర్తింపజేయనుంది ఆ రాష్ట్ర ప్రభుత్వం.

ఇలా ఆఫర్ ప్రకటించడానికి ఓ కారణం ఉంది… ఆ రాష్ట్రంలో యువతరం కనుమరుగైపోతోంది. 6,25,000 జనాభా ఉన్నా దాదాపు అక్కడి ప్రజలంతా వృద్ధాప్యానికి చేరుకున్నారు. ఇలాగే కొనసాగితే.. రాష్ట్రంలో ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ఉండరని, పన్ను చెల్లింపులు తగ్గిపోయి ఆర్థిక సంక్షోభం ఏర్పడే పరిస్థితి దగ్గర్లోనే ఉందని ప్రభుత్వం భావించింది.

Posted in Uncategorized

Latest Updates