ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఎమ్మెల్యేలంతా కోటీశ్వరులే

రాజస్థాన్‌లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన వారిలో ఎక్కువ మంది అభ్యర్థులు కోటీశ్వరులే ఉన్నారు. కొత్తగా ఎన్నికైన 199 మంది ఎమ్మెల్యేల్లో 158 మంది కోటీశ్వరులేనని ‘అసోయేషన్ ఆఫ్ డెమొక్రాటిక్ రిఫార్మ్’ నిర్వహించిన సర్వేలే స్పష్టమైంది. కాంగ్రెస్ నుంచి అత్యధికంగా 82 మంది కోటీశ్వరులు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ పార్టీకి మొత్తం 99 మంది ఎమ్మెల్యేలుండగా 17 మంది మినహా అందరూ కోటీశ్వరులే.

కాంగ్రెస్ తర్వాత బీజేపీ నుంచి ఎక్కువగా కోటీశ్వరులు ఎన్నికయ్యారు. ఆ పార్టీకి మొత్తం 73 మంది ఎమ్మెల్యేలుండగా… అందులో రూ.1 కోటికి మించి ఆస్తి ఉన్న ఎమ్మెల్యేలు 58 మంది ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు ప్రధాన పార్టీల నుంచి అత్యధికంగా కోటీశ్వరులే అవకాశం దక్కించుకోవడంతో.. ఇప్పుడు రాజస్థాన్ అసెంబ్లీలో ఉన్న మూడొంతుల మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరులే.

 

Posted in Uncategorized

Latest Updates