ఆ వయస్సు ఏంటీ.. ఈ ఆలోచనలు ఏంటీ : ఏడో తరగతి విద్యార్థి ఆత్మహత్య

హైదరాబాద్ కవాడిగూడలో బుధవారం (జూలై-25) ఏడో తరగతి విద్యార్థి మహేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ వయస్సులో ఈ ఆలోచనలు ఏంటీ అనేది అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. విద్యార్థి ఆత్మహత్య ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. బాలుడి తలకు గాయమైనట్టు పోలీసులు గుర్తించారు. అయితే విద్యార్థి ఆత్మహత్యకు స్కూల్‌ యాజమాన్యం వేధింపులే కారణమం అని పేరంట్స్ అంటున్నారు. ఫీజు కట్టలేదని వేధించారని చెబుతున్నారు. మహేష్ మృతికి స్కూల్ యాజమాన్యమే కారణమంటూ కుటుంబసభ్యులు, స్థానికులు ఆందోళనకు దిగారు.

స్కూల్ యాజమాన్యం వాదన మరోలా ఉంది. రెండు రోజులుగా మహేష్ స్కూల్ కు రావటం లేదని చెబుతున్నారు. అలాంటి అప్పుడు స్కూల్ యాజమాన్యం వేధింపులు అని ఎలా చెబుతారని ప్రశ్నిస్తున్నారు. అటు పేరంట్స్.. ఇటు స్కూల్ యాజమాన్యం నుంచి వివరాలు సేకరించిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. ఏడో తరగతి చదువుతున్న పిల్లోడు.. ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని చనిపోవటంపై అందరూ షాక్ అవుతున్నారు. ఈ వయస్సులో ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయని.. పిల్లలు ఆలోచనలు ఎటుపోతున్నాయని అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కూడా అనుమానాస్పద కేసుగా నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates