ఆ వర్శిటీలో మినీస్కర్ట్‌లు వేసుకోవచ్చు

chinaకొన్ని వర్శిటీలు డ్రస్ కోడ్ పై నిబంధనలు విధించాయి. అమ్మాయిలు మిడ్డీలు, స్కర్టులు వేసుకోకుండా నిషేధం పెట్టాయి. దీంతో స్టూడెంట్ల నుంచి తీవ్రంగా నిరసనలు వ్యక్తం అయ్యాయి. చైనాలోని హునాన్ అగ్రికల్చర్ యూనివర్శిటీ ఇలాంటి ఆంక్షలు విధించచడంతో విద్యార్థినిలు ఆందోళనకు దిగారు. నిరసన వ్యక్తం చేశారు. దీంతో దిగివచ్చిన వర్శిటీ అధికారులు ఆ నిషేధాన్ని ఎత్తివేసింది.

విద్యార్థినులు లైబ్రరీలోకి మినీ స్కర్ట్‌లు ధరించి రావడంపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయండంతో పాటు వారికి క్షమాపణలు చెప్పింది. కొందరు విద్యార్థినుల ఫిర్యాదుతో వర్శిటీ గతంలో ఈ నిబంధన విధించటంతో తీవ్ర దుమారం చెలరేగింది. ఈ అంశంపై స్పందించిన వర్శిటీ అధికారులు విద్యార్థినులు ఆధునిక తరహా దుస్తులు ధరించి లైబ్రరీకి రావడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. చదువుకు ఆటకం కాని అంశాలపై నిబంధనలు అవసరం లేదన్నారు.

Posted in Uncategorized

Latest Updates