ఆ విలీనం చట్ట విరుద్ధం : షబ్బీర్‌ అలీ

 హైదరాబాద్ : శాసన మండలి టీఆర్ఎస్‌ ఎల్పీలో కాంగ్రెస్‌ సభ్యుల విలీనం చట్టాలకు విరుద్ధమని, ఈ మేరకు మండలి ఇచ్చిన నోటిఫికేషన్ ను రద్దు చేయాలని కోరుతూ కాంగ్రెస్‌ పార్టీ హైకోర్టును ఆశ్రయించిం ది. కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ షబ్బీర్‌ అలీ నిన్న(సోమవారం) పిటిషన్‌ దాఖలు చేశారు. ఒక పార్టీని మరో పార్టీలో విలీనం చేసే అధికారం అసెంబ్లీ స్పీకర్‌కుగానీ, మండలి చైర్మన్ కుగానీ లేదన్నారు షబ్బీర్‌ అలీ. ఈ విషయంలో తగిన ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టును అభ్యర్థిం చారు. పిటిషన్ లో అసెంబ్లీ కార్యదర్శిని, శాసన మండలి చైర్మన్, కేంద్ర ఎన్నికల కమిషన్ తో పాటు టీఆర్ఎస్‌లోకి వెళ్లిన నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్సీలను ప్రతివాదులుగా చేర్చారు .

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీబీ రాధాకృష్ణన్ సెలవులో ఉండడంతో ఈ పిటిషన్ బుధవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. పార్టీ మారిన కాంగ్రెస్‌ ఎమ్మెల్సీలు ఆకుల లలిత, సంతోష్ కుమార్‌ లపై అనర్హత వేటు వేయాలంటూ కౌన్సిల్‌ చైర్మన్‌ స్వామిగౌడ్ కు షబ్బీర్‌ అలీ విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యం అంటే ఇదేనా? బర్రెలు, గొర్రెలను కొనుగోలు చేసినట్టుగా ప్రతిపక్ష ఎమ్మెల్సీలు,ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌ కొనుగోలు చేస్తోందని షబ్బీర్‌ ఆరోపించారు. ప్రతిపక్షాలు లేకుండా చేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ ఉన్నారని, ప్రజాస్వామ్యమంటే ఇదేనా అని ప్రశ్నిం చారు. ఒక పార్టీని మరో పార్టీలో విలీనం చేసే అధికారం స్పీకర్‌కు గానీ,మండలి చైర్మన్ కుగానీ లేదని, ఎన్నికల సంఘానికే ఉందని చెప్పారు . తమకు అధికారం ముఖ్యం కాదని, ప్రజాసేవలో ఉంటామన్నారు షబ్బీర్‌ అలీ. తనకు ప్రతిపక్ష హోదా కూడా తొలగించడం అన్యాయమన్నారు. టీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన ఎమ్మెల్సీలకు నోటీసులు ఇచ్చిన కౌన్సిల్‌ చైర్మన్‌.. టీఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్‌ ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలని కోరితే స్పందించడం లేదేమని ప్రశ్నించారు షబ్బీర్‌.

Posted in Uncategorized

Latest Updates