ఇంకా తగ్గాలమ్మా : మరికొన్ని పైసలు తగ్గిన పెట్రోల్, డీజిల్

petrol and desil price down 1వరుసగా ఆరో రోజు పెట్రోల్ , డీజిల్  ధరలు తగ్గాయి. ఇండియన్  ఆయిల్  కార్పొరేషన్  లెక్కల ప్రకారం లీటరు పెట్రోల్ పై 15 పైసలు ధర తగ్గింది. అదేవిధంగా లీటరు డీజిల్  ధరపై కూడా 14 పైసలు కోత పెట్టాయి చమురు సంస్థలు. దీంతో ఢిల్లీలో లీటరు పెట్రోల్  ధర రూ.78.11 నుంచి రూ.77.96కు దిగొచ్చింది. డీజిల్  కూడా రూ.68.97గా నమోదైంది. కర్ణాటక ఎన్నికల తర్వాత వరుసగా 16 రోజుల పాటు వాహనదారులకు వాత పెట్టిన చమురు సంస్థలు, ఆ తర్వాత మే 30 నుంచి తగ్గించడం మొదలెట్లాయి. మే 30 నుంచి ధరలు పైసల చొప్పున తగ్గుతుండటంతో, వరుసగా ఆరు రోజుల పాటు ఓవరాల్ గా పెట్రోల్  ధర 46 పైసలు, డీజిల్  ధర 33 పైసలు తగ్గింది.

దేశవ్యాప్తంగా ఇతర నగరాల్లో కూడా ఇదే రకమైన ధరల తగ్గింపు అమలవుతోంది. పెట్రోల్ , డీజిల్  ధరలు మరింత తగ్గుతాయని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్  చంద్ర గార్గ్  సంకేతాలు కూడా ఇచ్చారు. గత మూడు రోజుల నుంచి ఇంధన ధరలు నిలకడగా ఉంటున్నాయని. ఒకవేళ ఇదే కనుక కొనసాగితే, పరిస్థితి పూర్తిగా మన అదుపులోకి వస్తుందన్నారు. అంతర్జాతీయంగా క్రూడ్  ధరలు పెరగడంతోనే, దేశీయంగా ఇంధన ధరలు పెరిగాయని, ప్రస్తుతం అంతర్జాతీయంగా బ్యారల్  క్రూడ్  ఆయిల్  ధర 76 డాలర్ల నుంచి 75 డాలర్లకు తగ్గిందని చెప్పారు.

Posted in Uncategorized

Latest Updates