ఇంకా పెట్టనేలేదు.. అప్పుడే : జియో ఇనిస్టిట్యూట్ కు ప్రఖ్యాత హోదా

ఒక్క బిల్డింగ్ కానీ, విద్యార్ధి కానీ, అసలు ఇంకా ఏర్పాటు చేయని రిలయన్స్ గ్రూప్ తర్వలో ప్రారంభించబోతున్న జియో ఇన్ స్టిట్యూట్ కి కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ(HRD) ప్రఖ్యాత సంస్ధ హోదా ఇవ్వడంతో సోషల్ మీడియా వేదికగా కేంద్రంపై విమర్శలు చేస్తున్నారు నెటిజన్లు. ప్రముఖ లాయర్ ప్రశంత్ భూషణ్, ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ తో పాటుగా మరికొంతమంది ప్రముఖులు, విద్యార్ధులు కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతున్నారు.
దేశంలోని ఆరు ఇన్‌ స్టిట్యూట్ లకు సోమవారం(జులై-9) ప్రఖ్యాత సంస్థ స్టేటస్‌ ను కేటాయించింది కేంద్రం.

కేంద్రం ప్రకటించిన ఆరు ఇన్ స్టిట్యూట్ లలో IIT-ఢిల్లీ, IIT-ముంబై, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ బెంగళూరు, మణిపాల్ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, బిట్స్ పిలానీ, జియో ఇన్ స్టిట్యూట్ ఉన్నాయి. 2018, మార్చి 11న జియో ఇన్‌ స్టిట్యూట్‌ ను ఏర్పాటు చేయనున్నామని, ఈ ఇన్‌స్టిట్యూట్‌ ప్రారంభం కావడానికి మూడేళ్లు పడుతుందని నీతూ అంబానీ ప్రకటించారు. అసలు ఇంకా జియో ఇన్ స్టిట్యూట్ ని ప్రారంభించనేలేదు. అయినప్పటికీ దానికి ప్రఖ్యాత సంస్ధ హోదా కల్పించడంపై కేంద్రంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్క విద్యార్థి కూడా గ్రాడ్యుయేట్‌ సర్టిఫికేట్‌ పొందనటువంటి ఇన్ స్టిట్యూట్ కు అసలు ఏ ప్రాతిపదికన ప్రఖ్యాత సంస్థ స్టేటస్‌ ను కేటాయించారు అంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు.

ఇదొక భారీ కుంభకోణమని కొందరు ట్వీట్ చేస్తున్నారు. పొలిటకల్ సైన్స్ డిగ్రీ సర్టిఫికేట్ కోసం చివరకు మన నాయకులకు ఓ ఇన్ స్టిట్యూట్ వచ్చిందని, మోడీ గారికి, సృతి ఇరానీ గారికి ఈ ఇన్ స్టిట్యూట్ వల్ల చాలా లాభం ఉందని కామెంట్లు చేస్తున్నారు. తమ డిగ్రీ సర్టిఫికెట్లు తీసుకొనేందుకు జియో ఇన్ స్టిట్యూట్ గేటు బయట క్యూలైన్లలో విద్యార్ధులు నిలబడి ఉన్నారంటూ ప్రభుత్వ వైఖరిపై సెటైర్లు వేస్తున్నారు. అసలు జియో ఇన్ స్టిట్యూట్ ఏర్పాటు చేయలేనదడం తప్పు, మన దగ్గర డేటా లేక మనకు జియో ఇన్ స్టిట్యూట్ ఎక్కడ ఉందో కనిపించట్లేదంటూ మోడీపై సెటైర్లు వేస్తున్నారు. హెడ్ మాస్టర్ మోడీ గారు మాత్రమే జియో ఇన్ స్టిట్యూట్ లో జాబ్ చేస్తున్నారని కేంద్రప్రభుత్వ వైఖరిపై సెటైర్లు వేస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates