ఇంకెన్నాళ్లు ఈ దౌర్భాగ్యం : గుక్కెడు నీళ్ల కోసం ప్రాణాలకు తెగించి ఇలా..

WATAఎండాకాలం వస్తే నీటి కష్టాలు తప్పనిసరై పోయాయి. గుక్కెడు నీళ్ల కోసం కిలోమీటర్ల కొద్దీ ప్రజలు నడుస్తూ నానా తంటాలు పడుతుంటారు. బిందెడు నీళ్ల కోసం ఆ గ్రామస్తులు పడుతున్న ఇబ్బందులు.. ఇప్పుడు అందరి హృదయాలను కలచివేస్తున్నాయి. దేశంలో ఇంకా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా.. నీళ్ల కోసం ప్రాణాలను సైతం ఫణంగా పెడుతున్నారా అనే ఆశ్చర్యం కలుగుతుంది. అంతేకాదు.. రానున్న కొద్ది రోజుల్లోనే మనదేశం తీవ్ర నీటికొరతను ఎదుర్కొనాల్సి వస్తుందని.. కేప్ టౌన్ ఘటనలు భారత్ లో కనిపిస్తున్నాయని ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

మధ్యప్రదేశ్ రాష్ట్రం దిండోరి జిల్లాలో ప్రజలు గుక్కెడు నీళ్ల కోసం తమ జీవితాల్ని పణంగా పెట్టి దాహం తీర్చుకుంటున్నారు. ఎండ తీవ్రతతో అన్ని చోట్లా నీళ్లు అడుగంటిపోవడంతో.. ఊరి చివర్లో ఉన్న ఒక్క బావిలోకి ప్రజలు చాలా రిస్క్ చేసి దిగి నీళ్లు తెచ్చుకుంటున్నారు. బావి అడుగు నుంచి వస్తున్న ఊట నుంచి గ్లాసులతో బెందెలను నీళ్లతో నింపుకుంటున్నారు. నీళ్ల కోసం ప్రాణాలతో  చెలగాటం ఆడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు రెండు వాటర్ టాంకర్లను ప్రతిరోజూ గ్రామానికి పంపించి తమ నీటి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ వీడియో చూసిన తర్వాత అయినా.. అధికారుల్లో చలనం వస్తుందో లేదో చూడాలి..

Posted in Uncategorized

Latest Updates