ఇంక చాలు ఆపేయండి : ధోనీ ఎక్కడికీ వెళ్లటం లేదు

ధోనీ రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడా.. క్రికెట్ కు గుడ్ బై చెబుతున్నాడా.. వయస్సు మీద పడటం.. కుర్రోళ్లకు అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నాడా.. ఇటీవల కాలంలో ఫామ్ కూడా కోల్పోవటం కూడా దీనికి కారణం అంటూ రకరకాల వార్తలు వచ్చేశాయి. జాతీయ పత్రికల్లోనూ ధోనీ రిటైర్మెంట్ అంటూ ప్రచారం జరిగింది. దీనిపై కోచ్ రవిశాస్త్రి స్పందించారు. ఇంకా చాలు ఆపండి అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చాడు. ధోనీ ఎక్కడికీ వెళ్లటం లేదు.. ఎటూ వెళ్లడు.. ఎందుకు అనవసరంగా ఈ విషయాన్ని పెద్దది చేసి రాస్తున్నారు అంటూ అసహనం వ్యక్తం చేశారు. టీమిండియాతో ధోనీ మరికొంత కాలం కలిసి ప్రయాణిస్తాడు అని వివరణ ఇచ్చారు రవిశాస్త్రి. రిటైర్మెంట్ ప్రకటించాలి అనుకుంటే.. అందర్నీ పిలిచి చెబుతారు కదా.. మీరు ఎందుకు తొందర పడుతున్నారు అంటూ చురకలు అంటించారు.

ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తున్నారు అనటానికి సాక్ష్యాలు, సెంటిమెంట్లు చూపిస్తున్నారు క్రీడానిపుణులు. 2014లో టెస్ట్ మ్యాచ్ లకు రిటైర్మెంట్ ప్రకటించే సందర్భంలో అంపైర్ల నుంచి వికెట్ బెల్స్ తీసుకున్నాడు. ఇంగ్లండ్ తో వన్డే మ్యాచ్ ముగిసిన తర్వాత అంపైర్ నుంచి బాల్ తీసుకున్నాడు. తన చివరి మ్యాచ్ లో ఏదో ఒకటి తీసుకుని.. జ్ణాపకంగా ఉంచుకోవటం క్రికెటర్లకు ఇష్టం. ఆ క్రమంలో ఇలా చేశాడు అనేది అందరూ అంటున్నారు. బంతిని బౌలింగ్ కోచ్ భరత్ కు చూపించటానికే తీసుకున్నాడని కోచ్ రవిశాస్త్రి అంటున్నారు. గ్రౌండ్ లో, మ్యాచ్ లో బంతితో పడిన ఇబ్బందులను వివరించటానికి అలా చేశాడని.. రిటైర్మెంట్ ఉద్దేశం ధోనీకి లేదని వెల్లడించాడు.

Posted in Uncategorized

Latest Updates