ఇంగ్లండ్‌ తో టెస్ట్ సిరీస్ : కుర్రోళ్లకు ఛాన్స్ దొరికింది

ఇంగ్లండ్‌ తో జరుగనున్న టెస్ట్‌ సిరీస్‌ కు సెలెక్షన్‌ కమిటీ మొదటి మూడు టెస్టుల కోసం టీంను ప్రకటించింది. యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు ఫస్ట్ టైం టెస్ట్ టీమ్‌లో చోటు కల్పించారు. వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా గాయపడటంతో అతని స్థానంలో పంత్‌కు చాన్సిచ్చారు. దినేష్ కార్తీక్‌ను ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్‌గా ఎంపిక చేశారు. వేలి గాయంతో బాధపడుతున్న జస్‌ప్రీత్ బుమ్రాకు కూడా టెస్ట్ టీమ్‌లో స్థానం దక్కింది. గాయం నుంచి కోలుకోగానే అతను టీమ్‌తో చేరనున్నాడు. యోయో టెస్ట్ పాసయిన పేస్ బౌలర్ మహ్మద్ షమిని కూడా ఎంపిక చేశారు. బుమ్రాను టీమ్‌లోకి ఎంపిక చేసినా.. అతను రెండో టెస్ట్ నుంచి తుది జట్టు ఎంపికకు అందుబాటులో ఉంటాడని  BCCI తెలిపింది. ఆగ‌స్ట్ 1న ఎడ్‌బాస్ట‌న్‌లో ఇండియా, ఇంగ్లండ్ ఫస్ట్ టెస్ట్ జరుగుతుంది.

టీమిండియా జట్టు:  విరాట్‌ కోహ్లి (కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌, కేఎల్‌ రాహుల్‌, మురళీ విజయ్‌, పుజారా, అజింక్యా రహానే, కరుణ్‌ నాయర్‌, దినేశ్‌ కార్తీక్‌, రిషబ్‌ పంత్‌, అశ్విన్‌, రవీంద్ర జడేజా, కుల్దీప్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్యా, ఇషాంత్‌ శర్మ, మహ్మద్‌ షమి, ఉమేష్‌ యాదవ్‌, జస్ప్రీత్‌ బుమ్రా, శార్దూల్‌ ఠాకూర్‌ లను సెలెక్షన్‌ కమిటీ ఎంపిక చేసింది.

 

 

 

Posted in Uncategorized

Latest Updates