ఇంగ్లండ్ టెస్ట్: తొలి ఇన్నింగ్స్ లో భారత్  స్కోర్- 274


బర్మింగ్ హామ్ లో ఇంగ్లండ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో.. భారత్ మొదటి ఇన్నింగ్స్ ముగిసింది. 274 పరుగులకు ఆలౌట్ అయ్యింది.  మొదటి ఇన్సింగ్స్ లో 287 పరుగులకే ఆలౌట్ అయిన ఇంగ్లండ్ టీం.. సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. ఒక వికెట్ నష్టపోయి 9 పరుగులు చేసింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 23 పరుగులు ఆధిక్యంలో కొనసాగుతుంది ఇంగ్లీష్ టీం.

భారత్ ఇన్నింగ్స్ లో కెప్టెన్ విరాట్ కోహ్లీ తప్పా.. మిగితా బ్యాట్స్ మన్ ఎవరూ  రాణించలేకపోయారు. ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి భారత బ్యాట్స్ మన్ లు నిలువలేకపోయారు. ఓపెనర్లు ధావన్, మురళి విజయ్ తొలి వికెట్ కి 50 పరుగుల భాగస్వామాన్ని నమోదు చేశారు. అయితే 14 ఓవర్ లో తొలి వికెట్ గా విజయ్ వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన కేఎల్ రాహుల్ 4 పరుగులకు, ధావన్ 26, పాండ్యా 22, రహానే 15 రన్స్ మాత్రమే చేశారు.

టాప్ ఆర్డర్ అట్టర్ ప్లాప్ అవ్వడంతో టీం భారాన్ని తన మీదవేసుకున్న కెప్టెన్ కోహ్లీ.. విరోచితమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా.. ఒంటరిపోరాటం చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఇంగ్లండ్ గడ్డపై తొలి శతకం బాదాడు. 172 బంతుల్లో టెస్ట్ కెరీర్ లో  22వ సెంచరీ పూర్తి చేసిన విరాట్.. ఆ తర్వాత రెచ్చిపోయి ఆడాడు. చెత్త బంతులను సైతం  బౌండరీలకు తరలించి..స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. మొత్తం 225 బాల్స్ ఆడి 149 రన్స్ చేశాడు కోహ్లీ.

కోహ్లీ సూపర్ ఇన్నింగ్స్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు క్రికెటర్లు, అభిమానులు. విరాట్ అద్భుతమైన బ్యాటింగ్ చేశాడంటూ సచిన్ ట్వీట్ చేశారు. సెంచరీ చేసినందుకు అభినందనలు తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates