ఇంగ్లండ్ వన్డే: బుమ్రా అవుట్…శార్దూల్ ఇన్

shardulthakurఇంగ్లండ్‌ పర్యటనలో ఉన్న టీమిండియా శుక్రవారం(జులై-6) రాత్రి రెండో టీ20 మ్యాచ్‌ ఆడనుంది. వచ్చే ఆదివారం చివరి టీ20 ఆడనుంది. తర్వాత ఈ నెల 12 నుంచి మూడు వన్డేల సిరీస్‌ ప్రారంభం కానుంది. అయితే.. ఇటీవల ఐర్లాండ్‌తో జరిగిన మొదటి టీ20లో టీమిండియా పేసర్‌ జస్పిత్‌ బుమ్రా ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. ఎడమచేతి బొటనవేలికి అయిన గాయం ఇంకా మానకపోవడంతో ఆయనకు విశ్రాంతి నిచ్చిన సెలక్టర్లు… ముంబై పేసర్ శార్దూల్ ఠాకూర్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌కు దూరమైన బుమ్రా.. వన్డే జట్టుకు అందుబాటులో ఉంటాడని అనుకున్నారు. అయితే ఇంకా గాయం తగ్గక పోవడంతో మరింత విశ్రాంతి నిచ్చింది బీసీసీఐ. దీంతో బుమ్రా ఇంగ్లండ్‌తో జరగనున్న ఈ వన్డేలకి కూడా దూరం కానున్నాడు.

టీమిండియా జట్టు: రాట్‌ కోహ్లి(కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌, రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, సురేశ్‌ రైనా, ఎంఎస్‌ ధోని, దినేశ్‌ కార్తీక్‌, యజ్వేంద్ర చాహల్‌, అక్షర్‌ పటేల్‌, భువనేశ్వర్‌ కుమార్‌, శార్దూల్‌ ఠాకూర్‌, హార్దిక్‌ పాండ్యా, ఉమేశ్‌ యాదవ్‌.

Posted in Uncategorized

Latest Updates