ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత మహిళల టీం

indianwomens teamఇంగ్లాండ్ ఉమెన్స్ తో త్వరలో ఆరంభంకానున్న మూడు వన్డేల సిరీస్‌కు ఇండియన్ ఉమెన్స్ టీం ను ఆల్ ఇండియా ఉమెన్స్ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. 15 మంది సభ్యుల బృందాన్ని ప్రకటించింది. భారత జట్టుకు సీనియర్ బ్యాటర్ మిథాలీ రాజ్ నాయకత్వం వహించనుండగా.. హర్మన్‌ప్రీత్ కౌర్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. ఈ మ్యాచ్‌లు ఏప్రిల్ 6, 9, 12 తేదీల్లో జరగనున్నాయి. సిరీస్‌లోని అన్ని మ్యాచ్‌లు నాగ్‌పూర్‌లో జరగనున్నాయి.

ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న ఇంగ్లాండ్ సిరీస్ ఆరంభానికి ముందు నాగ్‌పూర్‌లోనే భారత్-ఏ జట్టుతో ప్రాక్టీస్ మ్యాచ్‌లో తలపడనుంది. మరోవైపు దీప్తి శర్మ నేతృత్వంలో 14 మంది సభ్యుల భారత-ఏ జట్టును కూడా సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ప్రస్తుతం సొంతగడ్డ ముంబైలో జరుగుతున్న ముక్కోణపు టీ20 టోర్నీలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఘోరంగా ఓటమి పాలైంది. ఈ సిరీస్‌లో భారత్ వరుసగా మూడో ఓటమిని ఎదుర్కొంది.

భారత మహిళల వన్డే జట్టు: మిథాలీ రాజ్(కెప్టెన్), హర్మన్‌ప్రీత్ కౌర్(వైస్ కెప్టెన్), స్మృతి మంధాన, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్, హేమలత, వేద కృష్ణ మూర్తి, దేవికా వైద్య, జులన్ గోస్వామి, శికా పాండే, పూజా వస్ర్తాకర్, ఏక్తా బిష్త్, పూనమ్ యాదవ్, సుష్మా వర్మ(వికెట్ కీపర్), రాజేశ్వరీ గైక్వాడ్.

Posted in Uncategorized

Latest Updates