ఇంగ్లాండ్ తో టీ20 ఫైనల్ : భారత్ ఫీల్డింగ్

INDటైటిల్ పోరుకు సమయం ఆసన్నమైంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ లో భాగంగా నిర్ణయాత్మక మ్యాచ్‌ లో తలపడేందుకు భారత్, ఇంగ్లండ్ సర్వసన్నద్ధమయ్యాయి. మాంచెస్టర్‌ లో అదిరిపోయే బోణీతో ఇంగ్లండ్ పర్యటనను ఆరంభించిన కోహ్లీసేన..కార్డిఫ్‌ లో పోరాడి ఓడింది. వరుసగా ఆరో సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకోవాలన్న పట్టుదలతో టీమ్‌ఇండియా కనిపిస్తుంటే.. పుంజుకుని పోటీలోకొచ్చిన ఇంగ్లండ్ సొంతగడ్డ సిరీస్‌ ను ముద్దాడాలన్న కాంక్షతో ఉన్నది. ఈ క్రమంలో ఆదివారం (జూలై-8) బ్రిస్టల్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది భారత్. ఫైనల్ మ్యాచ్ కావడంతో ఇరు జట్ల మధ్య రసవత్తర పోరుకు తెరలేచే ఆస్కారం ఉంది. ఇప్పటికే ఈ సిరీస్‌ లో ఇరు జట్లు తలో మ్యాచ్‌ లో విజయం సాధించిన విషయం తెలిసిందే.
జట్ల వివరాలు:

ఇంగ్లండ్: జేసన్ రాయ్, జాస్ బట్లర్(కీపర్), అలెక్స్ హేల్స్, ఇయన్ మోర్గన్(కెప్టెన్), జానీ బ్రిస్టో, బెన్ స్టోక్స్, డేవిడ్ విల్లీ, లైమ్ ప్లంకెట్, క్రిస్ జోర్డన్, అదిల్ రషీద్, జేక్ బాల్.

ఇండియా: రోహిత్ శర్మ, శిఖర్ ధవన్, లోకేశ్ రాహుల్, విరాట్ కోహ్లీ(కెప్టెన్), సురేష్ రైనా, ఎంఎస్ ధోనీ(కీపర్), హార్థిక్ పాండ్యా, దీపక్ చాహర్, ఉమేశ్ యాదవ్, సిద్ధార్త్ కౌల్, యుజవేంద్ర చాహల్.

Posted in Uncategorized

Latest Updates