ఇంగ్లాండ్ తో మ్యాచ్ : సిరీస్ పై కన్నేసిన భారత్

మూడు వన్డేల సిరీస్ లో భాగంగా రెండో వన్డోలో ఓటమిపాలైన టీమిండియా మంగళవారం(జూలై-17) జరిగే ఫైనల్ పై కన్నేసింది. ఇప్పటికే 1-1తో సమంగా ఉన్న ఇంగ్లాండ్ వన్డే సిరీస్ ను కైవసం చేసుకోవాలను చూస్తోంది. సెకండ్ వన్డేలో గెలిచి, జోరుమీదున్న జోరూట్ సెంచరీ ఫామ్..ఇలా ఇంగ్లాండ్ కాన్ఫిడెన్స్ గా ఉంది. భారీ తేడాతో ఓటమిని మూటకట్టుకున్న భారత్..ఈ మ్యాచ్ లో గెలిచి ఇంగ్లాండ్ పై ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది.

దీంతో ఇరుజట్ల మధ్యన జరిగే ఫైనల్ ఫైట్ టప్ గా జరగనుంది.  ఫస్ట్ వన్డేలో గెలిచి మంచి ఊపు మీద కనిపించిన టీమిండియా.. రెండో వన్డేలో చతికిలబడింది. ఇంగ్లండ్‌ చేతిలో 86 రన్స్ తేడాతో పరాజయం చెందడంతో.. సిరీస్‌ సమం అయ్యింది. దీంతో మూడో వన్డేకు ప్రాధాన్యత సంతరించుకుంది.  మంగళవారం జరిగే చివరి వన్డేలో గెలుపొందడంపై ఇరు జట్లు దృష్టి సారించాయి. లీడ్స్ వేదికగా మంగళవారం (జూలై-17) సాయంత్రం గం.5.00.లకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

Posted in Uncategorized

Latest Updates