ఇంగ్లాండ్ దే సిరీస్ : ఫైనల్లో టీమిండియా ఓటమి

వన్డే సిరీస్ ను సొంతం చేసుకుంది ఇంగ్లండ్. మూడో వన్డేలో భారత్ పై 8 వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో సొంత గడ్డపై పరువు నిలబెట్టుకుంది ఇంగ్లీష్ టీమ్. లీడ్స్ వేదికగా మంగళవారం (జూలై-17) జరిగిన ఫైనల్ మ్యాచ్ లో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ కు దిగిన భారత్.. 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి ఒక్కడే కెప్టెన్ ఇన్నింగ్స్ తో పర్వాలేదనిపించాడు. 72 బాల్స్ లో 8 ఫోర్లతో 71 రన్స్ చేసి ఔటయ్యాడు.

ఓపెనర్ శిఖర్ ధావన్ 44, ధోనీ 42 రన్స్ చేశారు. ఈజీ టార్గెట్ తో బరిలోకి దిగిన ఇంగ్లండ్.. 2 వికెట్లు కోల్పోయి 260 రన్స్ చేసింది. జో రూట్ 120 బాల్స్ లో సెంచరీ చేయగా… ఇయాన్ మోర్గాన్ 108 బాల్స్ లో 88 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. రషీద్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లభించగా… రూట్ కు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు లభించాయి.

Posted in Uncategorized

Latest Updates