ఇంజినీరింగ్ కాలేజీ ఆఫర్స్ ఇవి : స్టూడెంట్స్ కు ల్యాప్ టాప్స్, ఐఫోన్స్, బైక్స్ ఫ్రీ

ఇంజినీరింగ్ కాలేజీలో సీటు కోసం రికమండేషన్స్.. లక్షలకు లక్షలు డొనేషన్స్.. సీటు వస్తేనే ప్రపంచ కప్ గెలిచినంత సంబురం.. ఇదంతా గత వైభవం.. ఇప్పుడు పరిస్థితి మారింది. రివర్స్ సీన్ నడుస్తోంది. మా కాలేజీలో జాయిన్ అయితే బంపరాఫర్స్ ఉన్నాయి అంటూ కాలేజీలు ప్రకటిస్తున్నాయి. షాపింగ్ మాల్స్ సీజన్ వారీగా ఇచ్చే ప్రకటనల వలే ఉంది కాలేజీల దుస్థితి. దేశవ్యాప్తంగా అత్యంత గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న రంగం ఏదైనా ఉంది అంటే అది ఇంజినీరింగ్ కాలేజీలదే. గుజరాత్ లో అయితే కాలేజీలు ఇస్తున్న ఆఫర్స్ చూసి అందరూ నోరెళ్లబెడుతున్నారు.

AICTE (ఆల్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్) డేటా ప్రకారం దేశవ్యాప్తంగా 3వేల 291 కాలేజీలు ఉండగా.. 15.50 లక్షల సీట్లు ఉన్నాయి. గత ఏడాది ఇందులో 50శాతం సీట్లు మాత్రమే భర్తీ అయితే.. ఈ ఏడాది ఆ సంఖ్య బాగా తగ్గింది. మిగతా రాష్ట్రాల సంగతి ఎలా ఉన్నా.. గుజరాత్ రాష్ట్రంలో ఇంజినీరింగ్ కాలేజీ దుస్థితి మరీ దారుణంగా ఉంది. మొత్తం 55వేల 422 సీట్లు ఉండగా.. మొదటి విడత అడ్మిషన్ ప్రక్రియ ముగిసే సమయానికి 20వేల 780 సీట్లు మాత్రం భర్తీ అయ్యాయి. అంటే 34వేల 642 సీట్లు ఇంకా ఖాళీగా ఉన్నాయి. కాలేజీలు మూసివేసే పరిస్థితులు తలెత్తటంతో యాజమాన్యాలు దిగి వచ్చాయి. అడ్మిషన్ తీసుకునే స్టూడెంట్స్ కు భారీ ఆఫర్స్ ప్రకటించాయి.

గుజరాత్ ఇంజినీరింగ్ కాలేజీల ఆఫర్స్ ఇలా ఉన్నాయి :

… ఫస్ట్ సెమిస్టర్ ఫీజు రద్దు. మిగతా ఫీజు కూడా వాయిదాల్లో చెల్లించొచ్చు.

… నాలుగు సంవత్సరాల ఫీజును చివరి ఏడాది కాలేజీ నుంచి వెళ్లే సమయానికి చెల్లించొచ్చు. ఈ మూడేళ్లు ఫీజులపై ఆందోళన అవసరం లేదు

… కొన్ని కాలేజీలు స్టయిఫండ్ ఇస్తున్నాయి. ప్రతి ఏడాది రూ.2వేల 500 పాకెట్ మనీ కింద చెల్లిస్తున్నాయి.

… ల్యాప్ టాప్ ఉచితం. ఫ్రీ వై-ఫై సౌకర్యం ఉంది.

… మరికొన్ని కాలేజీలు ఐఫోన్లను ఫ్రీగా అందిస్తున్నాయి.

… హాస్టల్ ఫీజులో రాయితీ, మెస్ బిల్లులో డిస్కొంట్స్ కూడా ఇస్తున్నాయి కొన్ని కాలేజీలు

… మరికొన్ని టాప్ కాలేజీలు అయితే.. స్టూడెంట్స్ ను అట్రాక్ట్ చేయటం కోసం బైక్స్ ను ఉచితంగా ఇస్తున్నాయి.

… కొన్ని కాలేజీలు ఒక్కో అడ్మిషన్ కు రూ.10వేల కమీషన్ ఇస్తామని ఏజెంట్లను నియమించుకున్నాయి.

సీన్ రివర్స్ కావటం అంటే ఇదే.. ఒకప్పుడు వెలుగు వెలిగిన ఇంజినీరింగ్ కాలేజీలు.. ఇప్పుడు ఎదురు డబ్బులు ఇచ్చి మరీ స్టూడెంట్స్ ను ఎత్తుకెళుతున్నాయి. అయినా కూడా స్టూడెంట్స్ ఇంజినీరింగ్ వైపు మొగ్గు చూపకపోవటం విశేషం. దీనికి కారణం లేకపోలేదు.. దేశంలో 95శాతం మంది ఇంజినీరింగ్ స్టూడెంట్స్ కు నైపుణ్యం లేదని.. వేస్ట్ గాళ్లు అని పలు సందర్భాల్లో.. ప్రముఖ వ్యక్తులు అన్న మాటలే.. ఇప్పుడు ఈ దుస్థితికి కారణం.

Posted in Uncategorized

Latest Updates