ఇంటర్నెట్ సెన్సేషన్.. ఈ కపుల్ డాన్స్ చూశారా..

కపుల్ డాన్స్ చాలా చూసి ఉంటాం. కానీ.. ఇది కాస్త డిఫరెంట్. భర్తతో కలిసి భార్య వేసిన స్టెప్పులు ఇవి. “డాన్స్ అన్ని డ్రెస్సుల్లో చేయలేం. చీరలో ఉంటే అస్సలు స్టెప్పులు వేయలేం” అనే ఆడవాళ్లు తప్పకుండా ఈ డాన్స్ చూడాల్సిందే.

వీడియోలో ఉన్నది ఇద్దరు మిడిలేజ్ కపుల్. వారిది ఢిల్లీ. ఓ ఫ్యామిలీ ఫంక్షన్ లో కలిసి స్టెప్పులేశారు. బ్లాక్ అండ్ వైట్ లో రికార్డ్ అయిన ఈ వీడియో చూసినవాళ్లంతా వావ్ అంటున్నారు. భలే చేశారే డాన్స్.. అంటూ పొగిడేశారు నెటిజన్లు. దీంతో… సోషల్ మీడియాలో ఇటీవల బాగా వైరల్ అయింది ఈ వీడియో.

ఈ వీడియోను డాన్సింగ్ కపుల్ కూతురు గిటానా సింగ్ ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. వైరల్ కావడంతో.. వేలాది వ్యూస్.. కామెంట్లు వచ్చాయి. ఈ ఏజ్ లోనూ..అంత గ్రేస్ చూపించడం.. ఈజ్ చూపించడం.. భార్యా భర్తల మధ్య కెమిస్ట్రీ చూసి నెటిజన్లు ఫిదా అయిపోయారు. గిటానా తల్లిని ఈ విషయం అడిగితే… స్టెప్పులు ఎలా వేయించాలో తెలిసిన వాళ్లతో డాన్స్ చేయడం అంత కష్టం కాదు అనేసింది. బాల్ రూమ్ డాన్సింగ్ లో సింగ్ జీ ట్రెయిన్ అయ్యాడట. అలా… పార్టీలు, ఫంక్షన్లలో తన భార్య, కూతుళ్లతో స్టెప్పులేసి అలరిస్తుంటారు.

Posted in Uncategorized

Latest Updates