ఇంటర్ పరీక్షలకు అన్నీ ఏర్పాట్లు పూర్తి

interఫిబ్రవరి 28 నుంచి జరుగబోయే ఇంటర్ పరీక్షలకు అన్నీ ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి అశోక్‌కుమార్ తెలిపారు. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 14 వరకూ ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్నాయని ఆయన తెలిపారు.  ఉదయం 8: 45 గంటలకు పరీక్షలు ప్రారంభమయి మధ్యాహ్నాం 12 గంటలవరకూ జరుగుతాయని ఆయన తెలిపారు. ఉదయం 9 గంటల తర్వాత పరీక్షా కేంద్రంలోకి ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించమని, విద్యార్ధులు ముందస్తుగా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. విద్యార్థులతో పాటు ఇన్విజిలెటర్‌లకు కూడా సెల్‌ఫోన్‌ల అనుమతి లేదన్నారు. పరీక్షల నిర్వహణకు మొత్తం 1294 పరీక్షా కేంద్రాలను ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates