ఇంటర్ రిజల్ట్స్ : ఫస్ట్, సెకండియర్లలో మేడ్చల్ టాప్

KADIYAM INTERఇంటర్మీడియట్ ఫస్టియర్, సెకండియర్ రిజల్ట్స్ విడుదలయ్యాయి. ఫస్టియర్ 62.35.. సెకండియర్ లో 67.25 ఉత్తీర్ణత శాతం వచ్చిందని ఉపముఖ్యమంత్రి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి చెప్పారు. ఇంటర్ ఫలితాల్లో అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువగా పాస్ అయ్యారన్నారు.
ఫస్ట్ ఇయర్
 ఫస్ట్ ఇయర్ సంవత్సర పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల 55 వేల789 మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం ఉత్తీర్ణత శాతం 62.3గా నమోదైంది. ఫలితాల్లో మేడ్చల్ జిల్లా ప్రథమస్థానంలో నిలవగా మెదక్ జిల్లా చివరి స్థానానికి పరిమితమైంది. జిల్లాల వారీగా ఉత్తీర్ణత శాతం ఈ విధంగా ఉంది.
మేడ్చల్-79 శాతం, రంగారెడ్డి-74 శాతం, కొమురంభీం ఆసిఫాబాద్-71, ఖమ్మం-67, వరంగల్ అర్భన్-66, కరీంనగర్-66, ఆదిలాబాద్-63, హైదరాబాద్-63, భద్రాద్రి కొత్తగూడెం-62, వనపర్తి-61, నిజామాబాద్-57, కామారెడ్డి-57, పెద్దపల్లి-56, నిర్మల్-55, జోగులాంబ గద్వాల-54, మహబూబ్‌నగర్-54, రాజన్న సిరిసిల్ల-53, వరంగల్ రూరల్-53, జనగాం-53, సిద్దిపేట-52, సంగారెడ్డి-52, యాదాద్రి భువనగిరి-52, నల్లగొండ-51, సూర్యాపేట-51, వికారాబాద్-51, జయశంకర్ భూపాలపల్లి-50, జగిత్యాల-48, నాగర్‌కర్నూల్-48, మంచిర్యాల-45, మహబూబాబాద్-43, మెదక్-42 శాతంతో చివరి స్థానంలో నిలిచింది.

సెకండ్ ఇయర్

సెకండ్ ఇయర్ లో కొమురం భీం ఆసిఫాబాద్, మేడ్చల్ జిల్లాలు 80శాతం ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో ఉన్నాయి. మహబూబాద్ జిల్లా 40 శాతంతో చివరి స్థానంలో నిలిచింది. జిల్లాల వారీగా ఉత్తీర్ణత శాతం ఈ విధంగా ఉంది.
మేడ్చల్- 80 శాతం, కొమురంభీ ఆసీఫాబాద్-80 శాతం, రంగారెడ్డి-77, ఖమ్మం-72, వరంగల్ అర్భన్-71, కరీంనగర్-71, భద్రాద్రి కొత్తగూడెం-68, నిజామాబాద్-66, నల్లగొండ-66, హైదరాబాద్-65, కామారెడ్డి-65, ఆదిలాబాద్- 64, నిర్మల్-64, పెద్దపల్లి-64, జనగామ-62, వనపర్తి-62, మహబూబ్‌ నగర్-61, వికారాబాద్-61, యాదాద్రి భువనగిరి-60, సంగారెడ్డి-59, రాజన్న సిరిసిల్ల-59, జగిత్యాల-58, వరంగల్ రూరల్-58, సిద్దిపేట-57, నాగర్‌ కర్నూల్-55, జయశంకర్ భూపాలపల్లి-54, మంచిర్యాల-51, జోగులాంబ గద్వాల-51, మెదక్-49, సూర్యాపేట-48, మహబూబాబాద్-40 శాతంతో చివర స్థానంలో నిలిచింది.

సెకండ్ ఇయర్ ఫలితాల్లో గిరిజన గురుకులాలు సత్తా చాటాయి. గిరిజన గురుకుల పాఠశాలలు అత్యధికంగా 87 శాతం ఉత్తీర్ణత సాధించాయి. సాంఘీక సంక్షేమ రెసిడెన్షియల్స్ 86 శాతం ఉత్తీర్ణతతో రెండోస్థానంలో నిలిచాయి. 69 శాతంతో ప్రైవేట్ జూనియర్ కాలేజీలు చివరిస్థానంలో నిలిచాయి. మే 14 నుంచి ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లించేందుకు ఏప్రిల్ 20 గడువుగా ఉంది.

Posted in Uncategorized

Latest Updates