ఇంటర్ స్టూడెంట్స్ ఫైటింగ్ : కత్తిపోట్లతో ఓ విద్యార్థి మృతి

హైదరాబాద్ సిటీ శివార్లలో దారుణం. ఇంటర్ స్టూడెంట్స్ మధ్య జరిగిన ఫైటింగ్.. ఓ విద్యార్థి ప్రాణం తీసింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి హూడా ట్రేడ్ సెంటర్‌లో ఈ ఘటన జరిగింది. ఇంటర్ విద్యార్థి అజయ్‌బాబును మరో విద్యార్థి సంపత్ కత్తితో పొడిచాడు. ఆదివారం అర్థరాత్రి (జూలై-15) ఈ స్టూడెంట్స్ మధ్య ఘర్షణ జరిగింది. ఆ సమయంలో వారు మందు తాగినట్లు భావిస్తున్నారు పోలీసులు. ఇద్దరి మధ్య మాటమాటా పెరిగింది. ఆవేశంలో సంపత్.. కత్తితో అజయ్ బాబుపై దాడి చేశాడు. పొత్తి కడుపులో పొడిచాడు. ఈ ఘటన చూసిన స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అప్పటికే అజయ్ బాబు కుప్పకూలిపోయాడు. యువకుడిని.. స్థానికులే ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అజయ్ బాబు చనిపోయాడు.

ఇద్దరు విద్యార్థులు చందానగర్ హూడా కాలనీలోనే నివాసం ఉంటున్నారు. స్నేహితులు అని కూడా చెబుతున్నారు. ఘటపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంపత్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Posted in Uncategorized

Latest Updates