ఇంటివాడైన కామెడీ కింగ్ కపిల్

టీవీ స్టార్ కమెడియన్ కపిల్ శర్మ ఓ ఇంటివాడయ్యాడు. స్నేహితురాలు గిన్నీఛత్రాత్, కపిల్ శర్మ పంజాబీ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరి వివాహం.. జలంధర్ లోని పగ్వారాలో డిసెంబర్ 12 బుధవారం రాత్రి జరిగింది. ఓవైపు… అంబానీ ముద్దుల తనయ ఈషా అంబానీ0- ఆనంద్ పిరమాల్ పెళ్లి సమయంలోనే.. కపిల్- గిన్నీ సెలబ్రిటీ కపుల్ కూడా ఒక్కటైంది.

పెళ్లికి ముందురోజునుంచే.. మెహెందీ, జాగరణ్ లాంటి కార్యక్రమాలు నిర్వహించారు. పెళ్లి వేడుకను సోషల్ మీడియాలో లైవ్ లో ప్రసారం చేశారు. దీపికాపడుకోన్- రణ్ వీర్ సింగ్, ప్రియాంకా చోప్రా-నిక్ జోనస్ ఇంకా.. చాలామంది సినీ, ఫ్యాషన్ ప్రముఖులు, సెలబ్రిటీ జంటలు, ఫ్రెండ్స్, టీవీ ప్రముఖులు .. కపిల్ పెళ్లి వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. డిసెంబర్ 14న అమృత్ సర్ లో ఒకటి… డిసెంబర్ 24న ముంబైలో మరో రిసెప్షన్ ను ఏర్పాటుచేసింది కపిల్ శర్మ-గిన్నీ జంట.

సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ పూరీ తీరంలో… కపిల్ శర్మ- గిన్నీ ఛత్రాత్ లకు తనదైన స్టైల్ లో వెడ్డింగ్ విషెస్ అందించాడు. మీ జంట కలకాలం కలిసి ఉండాలంటూ… తీరైన ఆకృతి తీర్చిదిద్ది రంగులద్దాడు.

 

 

 

 

Posted in Uncategorized

Latest Updates