ఇంటి వైద్యానికి కేరాఫ్… ఎర్రగడ్డలోని ఆయుర్వేదిక్ కాలేజి

కంప్యూటర్ యుగంలో ఆయుర్వేద వైద్యాన్ని మరిచిపోతున్నారు జనం. రుషుల సంస్కృతిని నిర్లక్ష్యం చేస్తూ కార్పోరేట్ హాస్పిటల్స్ వైపు పరుగులు పెడుతున్నారు. అయినా ఇంటి వైద్యమే అన్నిరకాలుగా బెటరంటున్నారు ఆయుర్వేద డాక్టర్లు.

దగ్గు, దమ్ము, తలనొప్పి లాంటి చిన్నచిన్న సమస్యలకు ఇంటి వైద్యమే బెటర్. ఇంట్లో  వాడే పసుపు, సొంటి, జిలకర ఆరోగ్యానికి ఎంతో మంచిది. కళ్ల ముందు కనిపించే  మొక్కలే మందులా పనిచేస్తాయని తెలుసుకుంటేచాలు హాస్పిటల్స్ కు వెళ్లాల్సిన అవసరమే లేదంటున్నారు ఆయుర్వేద డాక్టర్లు. గతంలో అనారోగ్య సమస్య వస్తే.. ఇంటి వైద్యం సరిపోయేదంటున్నారు పెద్దలు. వంటింట్లో  దొరికే వస్తువులే మందులా పనిచేసేవని చెబుతున్నారు.

ప్రస్తుతం ఏ చిన్న సమస్య వచ్చినా… హాస్పిటల్స్ కు వెళ్తున్నారు జనం. ఆయుర్వేద వైద్యంపై అవగాహన లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో హాస్పిటల్స్ కు వెళ్తున్నారు. ప్రభుత్వం ఆయుర్వేద వైద్యంపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరుతున్నారు. ఆరోగ్యం మహాభాగ్యమని తెలిసినా..జనం నిర్లక్ష్యం చేస్తున్నారని యోగా గురువులు చెబుతున్నారు. రోజు యోగా చేస్తే హాస్పిటల్ కు వెళ్లాల్సిన అవసరం లేదంటున్నారు. అనారోగ్య సమస్యలకు ఆయుర్వేద వైద్యమే  మంచిదంటున్నారు.

ఇంటి వైద్యానికి కేరాఫ్ గా ఎర్రగడ్డలోని ఆయుర్వేదిక్ కాలేజీ నిలుస్తోంది. ఇందులో 150 వెరైటీ మెడిసినల్ మొక్కలు పెంచుతూ… ఏ మొక్క ఏ రోగానికి పనిచేస్తుందో విద్యార్థులకు చెబుతున్నారు. వంటింటి వస్తువులతో పాటు మన చుట్టూ ఉండే మొక్కలు కూడా అనారోగ్య సమస్యలకు మందులా పనిచేస్తాయంటున్నారు. కంటి ముందు ఎన్నో మొక్కలున్నా.. వాటి ఉపయోగం తెలియకపోవడంతో పట్టించుకోలేదంటున్నారు ఆయుర్వేదిక్ స్టూడెంట్స్. ఒక్కో మొక్క ఏదో హెల్త్ ప్రాబ్లమ్స్ కు మందులా పనిచేస్తుందని తెలుసుకుంటున్నట్లు చెబుతున్నారు.  పాతంకాలం నాటి ఆయుర్వేదంపై మరింత అవగహన కల్పించాలని కోరుతున్నారు జనం.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Posted in Uncategorized

Latest Updates